13వ రోజు ‘మేమంతా సిద్ధం’: జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 13 Live Updates And Top Headlines - Sakshi
Sakshi News home page

13వ రోజు ‘మేమంతా సిద్ధం’: జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం

Published Fri, Apr 12 2024 8:20 AM | Last Updated on Fri, Apr 12 2024 11:32 AM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 13 Updates, Highlights - Sakshi

Memantha Sidham Day 13 Highlights CM Jagan Bus Yatra Details

కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్

  • టీడీపీ, బీజేపీని వదిలి వైసీపిలో చేరిన కీలకమైన నేతలు
  • తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కీలక నేతలు
  • పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి

  • ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ
  • కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి
  • కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి
  • బీజేపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్‌ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్‌

ధూళిపాళ్ల నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

  • సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’  బస్సు యాత్రకు విశేష స్పందన
  • బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం

నేడు 13వ రోజు గుంటూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఉప్పొంగుతున్న అభిమానం
  • సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం

కాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం

  • ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం
  • సత్తెనపల్లి, కొర్రపా­డు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్‌ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
  • అనంతరం చుట్టు­గుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్‌ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
  • సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్‌ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.
     

ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం

  • సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’  బస్సు యాత్రకు విశేష స్పందన
  • టీడీపీ–జనసేన–బీజేపీ నేతల వెన్నులో వణుకు
  • రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు బస్సు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం 
  • నిజాయితీతో, నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement