
అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు
కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అయ్యా చంద్రబాబూ.. మీ పాలనలో గుర్తొచ్చే పథకమేదైనా ఉందా?
ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్‌గా చూపావా?
అంత ధైర్యం, దమ్ము ఉందా?
చూపవుగాక చూపవు.. ఎందుకంటే చేసిన మంచేమీ లేదు.. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే
తోడేళ్లు, మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోంది
ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి.. ఇవి రాష్ట్ర భవిష్యత్, పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు
మీ ఓటు.. మీ ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. 99 శాతం హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చా
మీ ఇంట మీకు మేలు జరిగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి
ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకొనో, లేక ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించు కొనో.. ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు.. నిజంగా మంచి చేసి ఉంటే ఆ పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? మేనిఫెస్టోలో కనీసం 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. ప్రజల్ని మభ్య పెట్టడమే మీకు తెలిసిన విద్య. నా గతాన్ని చూసి ఓటు వేయండని ప్రజలను అడిగే ధైర్యం ఉందా చంద్రబాబూ?
– సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు.. ఈ పాత్రలన్నీ కలిపితే చంద్రబాబు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో మనకు నచ్చనివన్నీ కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్.. చంద్రబాబును 4 నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. 14 ఏళ్లు సీఎంగా చేశావు.. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందా? మీ ముందే, మీ సమక్షంలో.. ఇలా సిద్ధం సభల్లో లక్షలాది మంది ముందు ఇప్పటికే ఎన్నోసార్లు అడిగాను.
నాకైతే సమాధానం చెప్పలేదు. పోనీ, మీకైనా చెప్పాడా.. అంటే అదీ లేదు’ అని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇదే మోసాల బాబును మరో ప్రశ్న కూడా అడిగానన్నారు. ‘ఎన్నికల ముందు మూడుసార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలు ఇచ్చావు. ఎన్నికలైన తర్వాత ఒక్కసారి అయినా ఇలా.. నాలా.. పబ్లిక్‌గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. ఇదిగో నెరవేర్చాను.. అని చెప్పావా? మేనిఫెస్టోలో నీవు చెప్పింది ఒక్కటైనా అమలు చేశావా? చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు.
ఆ తర్వాత అది చూపించరు. నాకైతే చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకు ఉందా బాబూ..?’ అని నిప్పులు చెరిగారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే..
వారంతా తోడేళ్లు, మోసగాళ్లు
► ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ బిడ్డ జగన్ పేదల పక్షం, ప్రజల పక్షం. ఈ యుద్ధంలో అటువైపు చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 తోడుగా ఉన్నారు. వీళ్లు సరిపోరని ఈ రా ష్ట్రాన్ని విడగొట్టిన ఒక జాతీయ పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరొక జాతీయ పార్టీ.. వీళ్లంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు పక్షమే. అవతలి పక్షంలో తోడేళ్లు, మోసగాళ్లుగా ఉంటున్న వాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. వీరందరికీ వ్యతిరేకంగా మేమంతా సిద్ధం.. సిద్ధం.. అని లక్షల సింహాల గర్జనతో మన జైత్ర యాత్ర ముందుకు సాగుతోంది.
► ‘మే 13న జరిగే ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, వృత్తి వర్గాల వారంతా సిద్ధమేనా? మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను రక్షించుకునేందుకు, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? ధర్మాన్ని గెలిపించడం కోసం, విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా.. సిద్ధమేనా?’ అని ప్రజలను ప్రశ్నించారు. (సిద్ధమేనని జనం నినదించారు). ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రజలకు మంచి చేశానని బాబు చెప్పలేడు
► నేను అది చేస్తాను.. నేను ఇది ఇస్తాను అని చెబుతాడు తప్ప.. తన గతం గురించి చెప్పడు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తాను, సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అని మాట్లాడతాడు తప్ప ఫలానా మంచి స్కీము తెచ్చాను.. దాన్ని చూసి నాకు ఓటు వేయండని ఈ పెద్దమనిషి అడగలేరు.
►ఎందుకంటే ప్రజలతో, పేదలతో ఈ పెద్దమనిషిది అతకని బంధం. చేసిన మంచి ఏమీ లేక నోటికి ఫెవికాల్ వేసుకుంటాడు. ఫెవిక్విక్ పూసుకుని నోరు మూసుకుంటాడు. మరి మీ బిడ్డ జగన్ ఇంటింటికీ మంచి చేస్తూ, ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేశారు. ఇంటింటికీ పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నాడు. అది పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, వివిధ పథకాలు కావచ్చు.. లేదా బర్త్ సరి్టఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కావచ్చు.
►మేనిఫెస్టో అంటే మన దృష్టిలో ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఎన్నికల తర్వాత చంద్రబాబులా చెత్తబుట్టలో వేయాల్సింది కాదు. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 99 శాతం హామీలు నెరవేర్చి మీ బిడ్డ మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడి మీ ఆశీస్సులు కోరుతున్నాడు.
లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తెచ్చాం
► మీ జగన్ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు. గత ఎన్నికల్లో ఓటు వేయని వారికి సైతం అర్హత ఉంటే చాలని మేలు చేశాడు. గ్రామాల్లో స్కూళ్లు, ఆస్పత్రులను మార్చాడు. వ్యవసాయ రంగానికి ఊతంగా నిలిచాడు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు. అవ్వాతాతల సంక్షేమం, అక్కచెల్లెమ్మల సాధికారత అంటే ఇదీ అని చేసి చూపించాడు మీ బిడ్డ జగన్. మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా నేను చేశానని ఇదే చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా?
►జగన్ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు. ఓ సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థ, ఇంగ్లిష్ మీడియం, నాడునేడుతో మారిన మన గవర్నమెంట్ బడులు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని మీ బిడ్డ ధైర్యంగా చెబుతున్నాడు.
►కుప్పం నుంచి ఇచ్ఛాపురం మధ్య ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెబుతున్న ప్రతి మాటా కళ్లెదుట కనిపిస్తోంది. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, మారిన ఇంగ్లిష్ మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో దిశ యాప్ కనిపిస్తుంది.
మంచి చేసి ఉంటే పొత్తులెందుకు?
చంద్రబాబును నిలదీసిన సీఎం జగన్
చంద్రబాబునాయుడు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే.. ఆ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘సిద్ధం సభల నుంచి మీ అందరి ముందు ఇదే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పటి వరకు నాకైతే చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా?’ అని అడిగారు. ‘అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే.. ఎన్నికలు అయ్యాక ఒక్కసారైనా నాలా పబ్లిక్‌గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా’ అని కూడా ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో రెండు పోస్ట్‌లు చేశారు.
సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రవాసాంధ్రుల సంఘీభావం
సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు లండన్‌లోని వైఎస్సార్‌సీపీ నాయకులు జైకొట్టారు. వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబుళరెడ్డి పాతకోటల ఆధ్వర్యంలో యూకేలోని లీసెస్టర్ నగరంలో సమావేశమై బస్సుయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్, కోరముట్ల పునీత్, పాలెం
క్రాంతి, చాళుక్య దేవరపల్లి, ఆదిత్య పుత్తికి రెడ్డి, ముడియాల కుమార్ పాల్గొన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేయండని ప్రతి ఒక్కరికీ చెప్పండి
►రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చిన్నారులు, విద్యార్థులు, యువత కోసం, వైద్యం కోసం ఇవి చేశానని మీ బిడ్డ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని అడగగలుగుతున్నాడు.
►ఈరోజు ఇంటింటా మంచి జరిగింది. మీరంతా మీ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలతో, ఇల్లాలితో, అవ్వాతాతలతో, చిన్న బిడ్డలు, పిల్లలతో మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదని వాళ్లతో మాట్లాడకుండా ఉండొద్దు. ఎవరి వల్ల మేలు జరిగిందని చర్చించండి. ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయన్న విషయాన్ని లోతుగా ఆలోచించాలని కోరుతున్నా.
►ఈ విషయం ప్రతి ఒక్కరికీ కూడా చెప్పాలి. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పండి. ఇదే చంద్రబాబును పొరపాటున ఎవరైనా నమ్మారా.. అంటే బంగారు కడియం ఇస్తానన్న పులి.. కథను గుర్తు చేయండి. చంద్రబాబును నమ్మడం అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి.
మన అభ్యర్థులను ఆశీర్వదించండి
మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన అభ్యర్థుల మీద ఉంచవలసిందిగా కోరుతున్నా. నెల్లూరు ఎంపీ అభ్యర్థి, నాకు అత్యంత సన్నిహితుడు, సౌమ్యుడు విజయసాయిరెడ్డిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. కావలి నుంచి ప్రతాప్, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్, కొవ్వూరు నుంచి ప్రసన్నకుమార్, నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు, మీలో ఒకరైన ఖలీల్, ఉదయగిరి నుంచి రాజగోపాల్, ఆత్మకూరు నుంచి విక్రమ్ (నా స్నేహితుడు గౌతమ్ సోదరుడు), కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్‌లను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాన్ అని మరచిపోవద్దు.
చంద్రబాబు విఫల హామీలు
►2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు.. ఇంటింటికీ పంపించిన పాంప్లెట్ ఇది. (చేత్తో చూపిస్తూ..) గుర్తుందా ఈ పాంప్లెట్? ఇందులో మోడీగారి ఫొటో ఉంది. దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజన్ చానల్‌లో వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ–5లో ఊదరగొడుతూ దీని గురించి అడ్వటైజ్ మెంట్లు కూడా ఇచ్చారు.
►రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? మీ ఇంట్లో.. మీ పక్కిళ్లలో 2014–2019 మధ్య ఆడ బిడ్డలు పుట్టారు కదా.. వాళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా?
►మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన కావలిలో ఏమన్నా కనిపించిందా? ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అంటున్నాడు. నమ్ముతారా?
►ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని జనం నినాదాలు) మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చాలి. మీరు సిద్ధంగా ఉంటే మోసగాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి, అందులోని టార్చ్ లైట్ వెలిగించండి. (అందరూ సెల్‌లో టార్చ్ వెలిగించి పైకెత్తి చూపారు). 175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉంది. కాబట్టి మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి.
Comments
Please login to add a commentAdd a comment