సాక్షి, తాడేపల్లి: తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని.. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.
‘‘గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత. టీడీపీ నేతలకు అతను రూ.30 కోట్ల వరకు ఇవ్వాలి. వాళ్లు గొడవలు పడి కేసులు పెట్టుకున్నారు. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు. నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు.
..నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు అతను వీడియో తీసుకున్నాడు. టీడీపీ వారే తన చావుకు కారణమని వీడియోలో చెప్పాడు. నాపై కుట్రలు మాని.. విచారణ జరిపించాలి. నా మీద ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర’’అని తలశిల రఘురాం మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment