
నేడు వైఎస్ జగన్ రాక
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం గుంటూరు వెళ్తారని చెప్పారు. పార్టీ నేత అంబటి రాంబాబు నివాసంలో అల్పాహారం స్వీకరిస్తారని, తరువాత నాయకులతో చర్చిస్తారని వివరించారు. ఆ తర్వాత ఒంగోలు వెళ్లి రెండు రోజులపాటు జరిగే పార్టీ కార్యక్రమాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురామ్ చెప్పారు.