
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలశిల రఘరాం స్పష్టం చేశారు. 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తొలుత రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని.. 25వ తేదీ తర్వాత రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగిస్తారని తెలిపారు.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో వైఎస్ జగన్ తొలిసభ ఉంటుందన్నారు. వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని వెల్లడించారు. ప్రజాసంకల్పయాత్ర సాగని 41 నియోజకవర్గాలో వైఎస్ జగన్ ఎన్నికల పర్యటన సాగేలా ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపారు. అందుకు తగ్గట్టు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని.. మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని అన్నారు. వారం రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment