
సాక్షి, అమరావతి: నూతనంగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో గవర్నర్ వీరితో ముచ్చటించారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్ధలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలని, అర్ధవంతమైన చర్యలతో ప్రజా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు.
ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాలను గురించి గవర్నర్‌కు వివరించారు. అలాగే పార్టీ కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాల గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్, అప్పిరెడ్డి గౌరవ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!!
Comments
Please login to add a commentAdd a comment