27న వైఎస్ జగన్ పర్యటన | YS jagan tour in this month 27th | Sakshi
Sakshi News home page

27న వైఎస్ జగన్ పర్యటన

Published Mon, Nov 25 2013 2:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS jagan tour in this month 27th

ఏలూరు, న్యూస్‌లైన్ :  జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావానికి దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ నెల 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. 26న తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. అదేరోజు రాత్రి నరసాపురం చేరుకుంటారు. రాత్రి నరసాపురంలో బసచేస్తారు.

27వ తేదీన27న  వైఎస్ జగన్ పర్యటన  తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఏడాదిన్నర తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పై-లీన్, హెలెన్ తుపాను వల్ల సర్వం కోల్పోయిన రైతులు, మత్స్యకారులు, ప్రజలు తమ బాధలు ఆయనకు చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement