మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ప్రజలకు రూ. 10 కోట్లు బాకీ పడ్డారు. అవును రాష్ట్ర వ్యాప్తంగా 300 పైగా కుటుంబాలకు ఆ డబ్బు ఇవ్వాల్సి ఉంది.. ఇస్తారా.. ఇవ్వరా ? ఎగ్గొడతారా చూడాలి.
వాస్తవానికి స్కిల్ స్కామ్ కింద చంద్రబాబు అరెస్ట్ అయ్యాక దేశ్ కీ నేతా.. విజనరీ.. తెలుగువాళ్ళ ఆత్మగౌరవం.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెట్టిన చాణక్యుడు .. నిప్పుకు ప్రతిరూపం.. సత్యానికి ప్రతిరూపం అయిన తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆక్రోశిస్తూ సభలు సమావేశాలు పెట్టి సానుభూతి ప్రోగుచేయాలని చూశారు. ఊరకనే ఈవెంట్లు చేస్తే వర్కవుట్ కావడం లేదని నిజం గెలవాలి అంటూ అక్టోబర్ 25 నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. వెళుతూ తన భర్త ఘనతను చెబుతూ కాస్త బాధపడుతూ.. అప్పుడప్పుడూ నవ్వుతూ ఏదో ఈవెంట్ నడిపించారు.
పనిలో పనిగా ఎల్లో మీడియాలో సైతం చంద్రబాబు అరెస్టును భరించలేక వందలాది మంది చనిపోతున్నారంటూ రోజూ వార్తలు వచ్చేవి. ఇంకా ఈ చావులని సైతం తమ మైలేజీ కోసం వాడుకోవాలని ప్లాన్ చేసిన టీడీపీ అలా మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షలు సాయం అన్నారు. కొన్ని కుటుంబాలకు మాత్రం ఇచ్చారు. ఫోటోలు దిగారు. ఈలోపు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అంతే ఠక్కున కరెంట్ పోగానే టీవీ ఆగిపోయినట్లు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఆగిపోయింది. అదేంటో మరి మిగతా 300 పైగా కుటుంబాలకు పైసా ఇవ్వలేదు. కనీసం ఉచిత సానుభూతి కూడా పలకలేదు. హఠాత్తుగా బస్సుయాత్ర నిలిపివేశారు.
మరి మిగతా కుటుంబాలను ఆదుకునేది ఉందా లేదా? అంటే తన భర్తకు బెయిల్ రాగానే నిజం గెలిచినట్లా? బెయిల్ రాగానే రాష్ట్రంలో నిజం గెలిచిందా? మరి చంద్రబాబు అరెస్టు భరించలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను ఓదార్పు.. ఆదరువు అక్కర్లేదా.. మీరు మీకుటుంబం సంతోషంతో ఉంటే చాలా?. మరి ఎంతోమంది చనిపోయారు అని మీరే అన్నారు కదా.. మరి వాళ్ళను ఎందుకు ఆదుకోరూ అని అంటున్నారు. మీకు బెయిల్ వస్తే నిజం గెలిచినట్లా? మాకు శాంతి లేదా.. అని మరణించినవారి ఆత్మలు ఘోషపెడుతున్నాయి. ఆ డబ్బులేవో మా కుటుంబీకులకు ఇచ్చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాయి.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment