వైస్రాయ్ హోటల్‌లో తన తండ్రి మీద చెప్పులు వేసి అవమానించినప్పుడు భువనేశ్వరి ఎందుకు బయటకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో తాము కొన్న భూములు, హెరిటేజ్‌కు చెందిన చంద్రబాబు కుటుంబం భూముల రేట్లు పడిపోతాయనే టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు దిగజారి తన భార్యను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారమిక్కడ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అమరావతిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలని ప్రజలు అడుగుతున్నారన్నారు.