
సాక్షి, విజయవాడ: చంద్రబాబు జైల్లో ఉండి అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాడని, అందుకే నారా భువనేశ్వరి, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా.. మరి ఆమె మంచి భోజనం, మందులు పంపట్లేదా..?’’ అంటూ పోసాని నిలదీశారు.
‘‘చంద్రబాబు జ్యుడిషల్ రిమాండ్‌లో ఉన్నారు.. జగన్ రిమాండ్‌లో కాదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా లేకపోతే లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు. అమిత్ షాని కలవడానికి లోకేష్‌కి సిగ్గు లేదా? అమిత్ షా మీద రాళ్లేయించి ఇప్పుడేమో కేసులు కోసం ఆయన్ను కలుస్తారా?. లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షాకి తెలియవనుకుంటున్నారా..?. కమ్మ వాళ్లని రెచ్చగొట్టడానికి భువనేశ్వరి, లోకేష్ అబద్దాలు చెబుతున్నారు. జైల్లో చంద్రబాబు డాక్టర్లు, పోలీసుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నాడు’’ అని పోసాని వివరించారు.
కాంగ్రెస్ అలవాట్లు బీజేపీకి అంటించాలని పురంధేశ్వరి అనుకుంటున్నారు. అమిత్ షా పై రాళ్లు వేయించిన లోకేష్‌ని ఆయన దగ్గరకి తీసుకెళ్లారు. మోదీని నీచంగా తిట్టిన చంద్రబాబు కోసం పురంధేశ్వరి తాపత్రయ పడటమా..?. పవన్ కళ్యాణ్, లోకేష్‌లు రాజకీయాలకు పనికిరారు. బట్టలు విప్పుతాం, కొడతాం అంటే ప్రజలు ఛీ కొడుతున్నారు’’ అని పోసాని మురళీ కృష్ణ దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment