సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అని యాత్ర మొదలుపెట్టారని.. అయితే నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని స్పష్టం చేశారాయన.
గురువారం రాజమహేంద్రవరంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేపట్టారు. అలా కాకుండా.. అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి అని ఉద్యమం చేయండి. అప్పుడు మీకు ఉపయోగం ఉండొచ్చు’’ అని ఎద్దేవా చేశారాయన.
‘‘సింపతీ కోసమే మీరు(భువనేశ్వరిని ఉద్దేశిస్తూ..) యాత్ర చేస్తున్నారు. మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు మీరు సిద్ధమా?. మీరు విచారణకు ఆహ్వానిండి.. అప్పుడు నిజం గెలుస్తుంది’’ అని అంబటి అన్నారు.
చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి. అందుకే బాబును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఇది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? అని అంబటి, టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకు పథకం ప్రకారమే ప్రచారం చేస్తున్నారని అన్నారాయన.
స్కామ్‌లన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చెప్పారా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా? తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా? రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా? అధికార ధనబలంతో నిజాన్ని ఇంతకాలం తొక్కిపెట్టారు అని అని భువనేశ్వరికి చురకలంటించారాయన.
పురందేశ్వరికి కౌంటర్
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన మద్యం ఆరోపణలపై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు దగ్గాయి. కొత్త డిస్టరీస్‌లకు అనుమతి ఇవ్వలేదు. కొత్త బ్రాండ్‌లకు అనుమతి ఇవ్వలేదు. బూమ్ బూమ్ బీర్లకు, ప్రెసిడెంట్‌మెడల్‌కు సైతం చంద్రబాబే అనుమతి ఇచ్చారు అని అంబటి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment