
అదేమిటో విచిత్రం. చంద్రబాబుకు.. ఆయన కుటుంబ సభ్యులకు తాము ఇబ్బందుల్లోను, చిక్కుల్లోను, ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే జనం గుర్తొస్తారు. తాను అధికారంలో విలాసాల్లో.. కంఫర్ట్‌గా ఉన్నపుడు ఏనాడూ పేదలు.. నిర్భాగ్యులు కనిపించరు. అప్పుడు వీళ్లంతా చీమల్లా.. దోమల్లా..పూచిక పుల్లలలా కనిపిస్తారు.. తమకు కష్టాలు రాగానే ప్రజల మద్దతు కోరతారు..చంద్రబాబు అరెస్టును భరించలేక రాష్ట్రంలో దాదాపు 300 మంది గుండె పోటు వచ్చి చనిపోయారని తెలుగుదేశం దాని మద్దతుదారు అయిన మీడియాలు ఊదరగొట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ మరణాలను తమకు అనుకూలంగా . సానుభూతిగా మార్చుకునే క్రమంలో నిజం గెలవాలి అంటూ ఓ మూడు రోజులు బస్సు యాత్ర చేశారు. మృతుల కుటుంబాలకు రూ. మూడు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. పనిలోపనిగా తన భర్తను జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ కొంత సానుభూతిని పోగేసి ప్రయత్నం చేసారు. ఈలోగా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది.
దీంతో ఆమె ఆయనకు స్వగాతాలు పలుకుతూ ఆ ఆనందంలో ఇటు కార్యకర్తలు మరణించిన అంశాన్ని మరచిపోయారు. ఓ విలేకరి ఇదే విషయాన్నీ ప్రస్తావించగా ఆయనకు బెయిల్ వచ్చేశాక ఇంకా యాత్ర అవసరం ఏముంది అంటూ తనకు మళ్ళీ ప్రజలను కలవాల్సిన అవసరం లేదని తప్పించుకున్నారు. దీనిమీద సోషల్ మీడియాలో విమర్శలు.. ట్రోలింగులు మొదలయ్యాయి. కేవలం సానుభూతికోసమే యాత్ర చేస్తారా.. మీ ఆయనకు బెయిల్ వస్తే ఇక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించక్కరలేదా?
తాజాగా మళ్ళీ భువనేశ్వరి నిన్న బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు.. చంద్రబాబు అరెస్టు భరించలేక గుండెలు ఆగిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం చేసారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వారికీ ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అప్పట్లోనే ఈ యాత్ర చేయకుండా కొన్నాళ్ళు బ్రేకిచ్చి ఎందుకు యాత్ర చేస్తున్నారన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? ఇంటిల్లిపాది తిరగడం కాకుండా పవన్ కళ్యాణ్.. బీజేపీ ఇతర పార్టీలతో సైతం పొత్తులు ఉండాలా ... ఇవేం లేకపోతే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోలేం అని భయం పట్టుకుందా.. అందుకే మళ్ళీ ఆమె బస్సు యాత్ర.. పరామర్శలు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
అటు యువనాయకుడు అని ఎంతగానో హైప్ ఇచ్చిన లోకేష్ పెద్దగా ప్రజలను ప్రభావితం చేయలేకపోవడం తెలుగుదేశానికి ఇబ్బందిగా మారింది. ఈ ఎన్నికలవేళ చంద్రబాబు వయసు రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం.. భారీ ప్రసంగాలు చేయడం వంటికి ఇబ్బందిగా మారిన తరుణంలో లోకేష్ కానీ సమర్థంగా ఉంటే పార్టీకి కొంత బలం అయ్యేది. కానీ లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ మటాష్ అయిపోయేలా కనిపిస్తుండడంతో టీడీపీ పెద్దలతోబాటు.. చంద్రబాబు, భువనేశ్వరి సైతం ఆందోళన చెందుతున్నారు. పనికిమాలిన కొడుకు. పార్టీకి భారమే తప్ప లాభం లేదని లోలోన భావిస్తున్నా బయటకు ఆ భావన కనిపించకుండా కవర్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో సైతం అలా కప్పి ఉంచలేక.. ఇప్పుడు భువనేశ్వరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆమె అయితే కాస్త మహిళా సెంటిమెంట్‌ను రగిలిస్తూ మహిళలతో మాట్లాడడం.. కొంత సానుభూతి పోగేసే అవకాశాలు ఉన్నట్లు భావించిన చంద్రబాబు ఆ మేరకు ఆమెను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment