సాక్షి, విజయవాడ : నగరంలోని పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్‌భవన్‌కు కేటాయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇటీవల కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సూర్యారావుపేటలోని పాత ఇరిగేషన్ కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 24వ తేదీన విశ్వభూషణ్ ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రమాణం చేయించనున్నారు.
గవర్నర్ కార్యదర్శిగా ఎంకే మీనా
అలాగే గవర్నర్ కార్యదర్శిగా ముకేశ్‌కుమార్ మీనాను ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంకే మీనాకు.. గవర్నర్ కార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment