
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బాలసాని కిరణ్, నారాయణ మూర్తి ఫిర్యాదు చేశారు.
టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, ఆయన అనుచరులు దాడికి దిగారని, తన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారని బాలసాని కిరణ్ అన్నారు. 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు. నా డ్రైవర్, మా కార్యకర్తలకు గాయాలయ్యాయి. మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బాలసాని కిరణ్ మండిపడ్డారు.
నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత నారాయణమూర్తి మండిపడ్డారు. రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరాం. ఈనాడు పత్రిక అడ్డగోలు రాతలపై కూడా ఫిర్యాదు చేశాం. సీఎం జగన్‌పై విషపు రాతలతో తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరాం’’ అని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment