సాక్షి, అమరావతి: హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత అని, ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ అన్నారు.
‘‘ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని, పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయని పేర్కొన్నారు.
‘‘ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి. ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
ఇదీ చదవండి: టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి
Comments
Please login to add a commentAdd a comment