ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సీఈవో ముఖేష్‌ కుమార్‌ | AP Chief Electoral Officer Mukesh Kumar Meena Press Meet | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం: సీఈవో ముఖేష్‌ కుమార్‌

Published Sat, Mar 16 2024 4:51 PM | Last Updated on Sat, Mar 16 2024 5:53 PM

AP Chief Electoral Officer Mukesh Kumar Meena Press Meet - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఫామ్‌ 12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించొచ్చని వెల్లడించారు.

ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
మే 13న పోలింగ్‌
జూన్ 4న ఓట్ల లెక్కింపు
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్ధానాలకు ఎన్నికలు
ఏపీలో  తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352...ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67393
18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 9,01,863 మంది ఓటర్లు వున్నారు
ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. తాజాగా 1,97,000 మంది పెరిగారు
ఈ రోజు వరకు వచ్చిన 6ఏ దరఖాస్తులు తీసుకుంటాం
ఏపీలో 46165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి
ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తాం
పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తాం
ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజు 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చు
85 సంవత్సరాలు పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
ఇందుకోసం ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
అభ్యర్ధుల తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్, టీవీలలో మూడుసార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది
3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం‌ వినియోగిస్తాం
ఏపీ ఎన్నికలకి 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు
ప్రతీ అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి
అనుమానిత ఖాతాలపై నిఘా
నాన్ కమర్షియల్ ప్రాంతాలలో ల్యాండ్ అయ్యే హెలీకాప్టర్లని  తనిఖీలు చేపడతాం
50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం
నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ అమలుల్లో ఉంటుంది.
బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు  తొలగించాలి
ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుంది
కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు
మంత్రులు సమీక్షలు చేయకూడదు
మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు
కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement