పోస్టల్ బ్యాలెట్ కలిపితే 82.5 శాతం!
వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు
కొన్ని చోట్ల సోమవారం రాత్రి 2 గంటల వరకు పోలింగ్ : సీఈవో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3% పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.2 శాతాన్ని కలుపుకొంటే ఇది 82.5 శాతమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈవో) కార్యాలయం వర్గాలు మంగళవారం రాత్రి వెల్లడించాయి. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ధృవీకరించాల్సి ఉంది.
2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ 0.6 శాతంతో కలుపుకొని 79.8 శాతం నమోదైంది. ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 79.40 శాతం నమోదైనట్లు మంగళవారం మధ్యాహ్నం సీఈవో ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగినందున ఎక్కడ ఎంత ఓటింగ్ జరిగిందో పూర్తి వివరాలు రావడానికి ఆలస్యమవుతోందని వివరించారు.
మంగళవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం జిల్లాలవారీగా పోలింగ్ (శాతాల్లో)
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ : 83.19
అల్లూరి సీతారామరాజు : 63.19
ఏలూరు : 83.04
సత్యసాయి : 82.77
చిత్తూరు : 82.65
ప్రకాశం : 82.40
బాపట్ల : 82.33
కృష్ణా : 82.20
అనకాపల్లి : 81.63
పశ్చిమ గోదావరి : 81.12
నంద్యాల : 80.92
విజయనగరం : 79.41
తూర్పు గోదావరి : 79.31
అనంతపురం : 79.25
ఎన్టీఆర్ : 78.76
కడప : 78.72
పల్నాడు : 78.70
నెల్లూరు : 78.10
తిరుపతి : 76.83
కాకినాడ : 76.37
అన్నమయ్య : 76.12
కర్నూలు : 75.83
గుంటూరు : 75.74
శ్రీకాకుళం : 75.41
మన్యం : 75.24
విశాఖ : 65.50
Comments
Please login to add a commentAdd a comment