Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర | Election Campaigns Closed In Andhra Pradesh From May 11th Evening, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికల కురుక్షేత్రం: నేటితో ప్రచారానికి తెర

May 11 2024 5:47 AM | Updated on May 11 2024 11:38 AM

Silent Period from 6 PM

సాయంత్రం 6 గంటల నుంచి ‘సైలెంట్‌ పీరియడ్‌’ 

48 గంటలపాటు మద్యం బంద్‌ 

‘సైలెంట్‌ పీరియడ్‌’లో ఇతర ప్రాంతాల వ్యక్తులు ఎవరూ ఉండకూడదు 

పోలీస్‌ కేసులున్నా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌మీనా 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మూగబోనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు.

 పోలింగ్‌ ప్రక్రియ దగ్గరపడటంతో వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే‹Ùకుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్‌ పీరియడ్‌) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.

చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్‌ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు/పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓట­ర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.



ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు 
పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ ఏజెంట్ల నియామక జాబితాను రిటరి్నంగ్‌ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. పోలింగ్‌ తేదీ రోజు ప్రిసైడింగ్‌ అధికారికి పోలింగ్‌ ఏజెంట్‌ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement