సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, వారి బంధువుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావా దేవీలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. ఓటర్లకు మద్యం, డబ్బుల పంపిణీ నిర్మూలనతో పాటు ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై బుధ వారం ఆయన సచివాలయంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ఆదాయపన్నుశాఖ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్‌కుమార్, అద నపు డీజీ(శాంతి భద్రతలు) నారాయణతో సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 22న సీఈసీ బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించారు. మద్యం అక్రమ పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సోమేశ్‌కుమార్ వివరించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంతో పాటుగా నోడల్ అధికారిని నియమించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణాను నిర్మూలించేందుకు సరిహద్దుల్లో 6 చెక్‌పోస్టులు ఏర్పా టుచేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే మద్యం, డబ్బుల పంపిణీని ఎక్సైజ్, పోలీసు, ఐటీ శాఖలు అడ్డుకోవాలని సీఈఓ సూచించారు.
అభ్యర్థుల ఖాతాలపై నిఘా!
Published Thu, Oct 18 2018 1:13 AM | Last Updated on Thu, Oct 18 2018 1:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment