State Legislative Assembly
-
అభ్యర్థుల ఖాతాలపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు, వారి బంధువుల బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఆదేశించారు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావా దేవీలపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. ఓటర్లకు మద్యం, డబ్బుల పంపిణీ నిర్మూలనతో పాటు ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై బుధ వారం ఆయన సచివాలయంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ఆదాయపన్నుశాఖ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్‌కుమార్, అద నపు డీజీ(శాంతి భద్రతలు) నారాయణతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈ నెల 22న సీఈసీ బృందం రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించారు. మద్యం అక్రమ పంపిణీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సోమేశ్‌కుమార్ వివరించారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాల పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంతో పాటుగా నోడల్ అధికారిని నియమించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణాను నిర్మూలించేందుకు సరిహద్దుల్లో 6 చెక్‌పోస్టులు ఏర్పా టుచేశామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే మద్యం, డబ్బుల పంపిణీని ఎక్సైజ్, పోలీసు, ఐటీ శాఖలు అడ్డుకోవాలని సీఈఓ సూచించారు. -
16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
16 నుంచి అసెంబ్లీ
- అదే రోజు నుంచి మండలి భేటీ కూడా - వారం పాటు నిర్వహించాలని యోచన - ఒక రోజు ముందు బీఏసీ సమావేశం - షెడ్యూల్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం - 10న కేబినెట్, 14న కలెక్టర్లతో సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలను ప్రకటించాల్సిందిగా గవర్నర్‌ను కోరుతూ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, అసెంబ్లీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజైన 15వ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు ఆగస్టు 30న ఒక రోజు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. తిరిగి మూడున్నర నెలల తర్వాత సమావేశాలు జరుగనుండటం ప్రాధాన్యాత సంతరించుకుంది. ఈసారి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా కేబినెట్ భేటీ ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజకీయ వ్యూహరచనపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి. ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు ఈనెల 14న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశంతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సెషన్లలో ఈ సమావేశం జరుగనుంది. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు సమావేశానికి హాజరుకావాలని సీఎం సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టర్లతో నిర్వహించే తొలి సమావేశం కావడంతో.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రణాళికల తయారీ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రజలను చైతన్యపర్చడం తదితర అంశాలపై అందులో చర్చించనున్నారు. 15న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను సమాయత్తం చేసేందుకు ఈనెల 15న ప్రగతి భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం చేరవేశారు. 18న క్రిస్మస్ వస్త్రాల పంపిణీ ఈనెల 18న ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద క్రైస్తవులకు వస్త్రాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేద కుటుంబాలకు దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం గత ఏడాది నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
అంకెల గారడీ
బడ్జెట్‌పై అన్నివర్గాల పెదవి విరుపు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతమాత్రమే సాక్షి ప్రతినిధి తిరుపతి : రాష్ట్ర శాసన సభలో గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ మసిపూసి మారేడు కాయ చేసినట్టు ఉందని పేర్కొంటున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించడం, మాయ చేయడం తప్ప అచరణలో మాత్రం అమలు కావటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీ-నీవా, గాలేరు- నగరి, తెలుగగంగ ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. ప్రాజెక్టులను మాత్రం ఏడాది లోపు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారని, అదెలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, వ్యవసాయ రుణమాఫీ వంటివాటి ఊసే లేకపోవడంపై రైతులు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సంక్షేమ పథకాలకు గండి కొట్టేలా నిధులు కేటాయింపు ఉందని అన్ని పక్షాల రాజకీయనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతికి నగరానికి.. తిరుపతిలో సైబర్‌స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కన్వెన్షన్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంక్యూబేషన్ సెంటర్‌కు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5000 హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీలకు.. జిల్లాలోని విశ్వవిద్యాలయాలకు గత ఏడాదితో పోలిస్తే కొద్దిమేర నిధులను పెంచారు. ఎస్వీయూకు రూ.163 కోట్లు, ప ద్మావతికి రూ.43.85 కోట్లు, వెటర్నరీ యూనిర్సిటీకి రూ 139.82, ద్రవిడ యూనివర్సిటీకి రూ.12.09 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టులకు అంతంత మాత్రమే.. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులకు అంతంతమాత్రంగా నిధులు కేటాయించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు రూ.3000 కోట్లకు పైగా నిధులు అవసరం కాగా, రూ.504 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం టెండరు పిలిచిన పనులే రూ.1200 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.2500 కోట్లకు పైగా నిధులు కావాల్సి ఉండగా, రూ.348 కోట్లు మాత్రమే కేటాయించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సైతం రూ.78.12 కోట్ల నిధులను కేటాయించడం గమనార్హం.