బాబూ.. ఎన్టీఆర్‌ మరణంపై షోలో మాట్లాడితే బాగుండేది: మేరుగు | YSRCP Merugu Nagarjuna Serious Comments ON CBN And Aha Show | Sakshi
Sakshi News home page

బాబూ.. ఎన్టీఆర్‌ మరణంపై షోలో మాట్లాడితే బాగుండేది: మేరుగు

Published Sat, Oct 26 2024 12:58 PM | Last Updated on Sat, Oct 26 2024 3:57 PM

YSRCP Merugu Nagarjuna Serious Comments ON CBN And Aha Show

సాక్షి, తాడేపల్లి: ప్రజలను వంచించి రాజకీయాలు చేయటమే చంద్రబాబు నైజం అని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇచ్చిన హామీలను అమలు చేయటం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదన్నారు. అలాగే, ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహా షోలో చంద్రబాబు, బాలకృష్ణ చెబితే బాగుండేది అంటూ కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి మేరుగు నాగార్జున శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాల కోసం ఏమైనా చేయగలరు. ప్రజలను మోసం చేసైనాసరే అధికారంలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. అన్‌స్టాపబుల్ కార్యక్రమం గురించి తెగ హైప్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో కూడా ఆహా షోలో చంద్రబాబు, బాలకృష్ణ చెబితే బాగుండేది. రాబోయే ఐదేళ్లు కరెంటు ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా మాట తప్పి వేల కోట్ల భారం జనం మీద వేయబోతున్నారు. రూ.6,072 కోట్లు విద్యుత్‌ ఛార్జీల పేరుతో జనాన్ని బాదబోతున్నారు.

ప్రజలను వంచించి రాజకీయాలు చేయటమే చంద్రబాబు నైజం. ఇచ్చిన హామీలను అమలు చేయటం అనేదే చంద్రబాబుకు లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పంటల ఉచిత బీమాని ఎత్తేసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. రూ.20 వేలు చొప్పున రైతులకు ఆర్ధికసాయం అని చెప్పి మోసం చేశారు. రాజమండ్రి జైలులో దోమలు కుడితే ప్రాణానికి హాని అంటూ హడావుడి చేశారు. మాదకద్రవ్యాల కేసులోని ఖైదీలతో ప్రమాదం ఉందని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంబులెన్స్ పక్కన ఉండాల్సిందేనని చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు కూడా అంబులెన్స్ పక్కన పెట్టుకునే నిద్ర పోతున్నారా?. డయేరియా, డెంగ్యూలతో జనం చచ్చిపోతుంటే చంద్రబాబుకు పట్టదా. చంద్రబాబుకు ఒక రూల్‌, ప్రజలకు ఒక రూలా? అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement