ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్‌సీపీ | Ysrcp Leaders Meet Ec Officials | Sakshi
Sakshi News home page

ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్‌సీపీ

Published Tue, May 28 2024 12:45 PM | Last Updated on Tue, May 28 2024 5:19 PM

Ysrcp Leaders Meet Ec Officials

సాక్షి, గుంటూరు: అడిషనల్‌ సీఈవోను వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది.

అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్‌ అధికారం సంతకం పెట్టి స్టాంప్‌ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్‌ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్‌ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.

‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు.

ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement