సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్‌ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు.
ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు.
అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు.
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్‌కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment