Babasaheb Ambedkar
-
దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది. 7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి. అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం) -
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్‌ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్‌ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్‌కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. -
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే
ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేడ్కర్‌ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి– అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పని చేస్తుంటే రాష్ట్రంలో పెత్తందార్ల పార్టీలకు, పెత్తందార్ల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నా – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: ‘అంటరానితనంపైతిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబా సాహెబ్ అంబేడ్కర్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికీ ఉన్నాయని, పెత్తందారీ పోకడలతో అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 206 అడుగుల ఎత్తైన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందన్నారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి అని తెలిపారు. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహాశిల్పం) అంటే ఇండియాలోని విజయవాడ అని మార్మోగుతుంది. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి ఈ విగ్రహం నిలువెత్తు నిదర్శనం. అంబేడ్కర్ జన్మించిన 133 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది వేల సంవత్సరాల భారత సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రలను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. బాబా సాహెబ్ మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, బతుకుల్లో, భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు ఆ మహా మనిషి. 75వ గణతంత్ర దినోత్సవానికి ముందు.. విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకి సరిగ్గా వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేడ్కర్ మహా విగ్రహం స్ఫూర్తిదాయకం. అది చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, సమానత్వ ఉద్యమాలు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. పుణె ఒప్పందం.. అండనిచ్చే మహాశక్తి ఆయన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై ఓ తిరుగుబాటుగా మనకు కనిపిస్తుంటారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా మనందరికీ గుర్తుకొస్తారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహా శక్తిగా మనందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారు. గొంతు విప్పలేని దళిత వర్గాలు, అల్ప సంఖ్యాకులు, వాయిస్ లెస్ పీపుల్, అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పుణె ఒప్పందానికి కారకులు అంబేడ్కర్. ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా, రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేడ్కరే స్ఫూర్తి. ప్రతివాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహాశక్తిగా తోడుగా నిలబడుతుంది. ఆకాశమంతటి వ్యక్తిత్వం రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామాజిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేడ్కర్ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇది దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా. 81 అడుగుల వేదిక మీద 125 అడుగుల మహా విగ్రహం.. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఆకాశమంతటి ఆ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని అంతా గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ, ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి – అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేడ్కర్ భావజాలం. ఇలాంటి భావజాలం పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. ఆయన చదివింది ఇంగ్లీషు మీడియంలో.. ఈరోజు కూడా ఈ దురహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. అంబేడ్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్లు అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. అంబేడ్కర్ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో. ఆయన 4వ తరగతి పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారు. ఈనాడు చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తోందంటే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచన చేయమని కోరుతున్నా. ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేస్తోంది. ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులు, బహుజనులకు వ్యతిరేకులు. అంటరానితనం.. మరో రూపంలోస్వాతంత్య్రం వర్థిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం, వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలతో రూపం మార్చుకుంది. అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మనుషులు చనిపోతున్నాకరుణించని పాలకులు.. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరాలు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో, అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేదలు బస్సు ఎక్కే ఆర్టీసీని కూడా ప్రైవేట్‌కు అమ్మేయాలనుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావాలన్నా లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లోనవుతూ, కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వాతాతలు పెన్షన్ కోసం, రైతన్నలు ఎరువుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, మనుషులు చనిపోతున్నా పాలకుల గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలని కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వటానికి వీల్లేదని కుట్ర కథనాలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పెత్తందార్లకు ఏనాడైనా తోచిందా? దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చింది లేదు. అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతకగలుగుతాయనే కనీస ఆలోచన చేయలేదు. బీసీలను తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఆ వ్యక్తికి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, గవర్నమెంట్ బడుల్లో డిజిటలైజేషన్, ఐఎఫ్‌పీలు, నాడు–నేడుతో చదువులు మార్చాలని అలాంటి òపెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థను తేవాలని వారికి ఎందుకు అనిపిస్తుంది? పేదలకు ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల ఉచిత వైద్యం, ఆరోగ్య ఆసరా, 104, 108 సేవలు, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ఆ పెత్తందారు చంద్రబాబుకు ఎందుకు అనిపిస్తుంది? గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు తెచ్చి ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉండాలని పెత్తందారు పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే దక్కేలా ఏకంగా చట్టం చేయాలని పెత్తందార్లకు ఎందుకు అనిపిస్తుంది? విప్లవాత్మక వ్యవస్థలు పెత్తందారీ పార్టీలు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం నవరత్నాల పాలన అందించాలని ఏ రోజైనా అనిపించిందా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని పెత్తందారీ పార్టీ నాయకులకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ 56 నెలల పాలనలో నేరుగా బటన్ నొక్కి రూ.2.47 లక్షల కోట్లు పారదర్శకంగా అందించాడు. లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తున్నారు. 2 వేల జనాభాకు సచివాలయం. 50 ఇళ్లకు వలంటీర్ ఉన్నారు. ప్రతి పేదవాడు, రైతన్న, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఇదీ అంబేడ్కర్ కలలుగన్న రాజ్యం అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. ఈ స్థాయిలో మరెక్కడైనా ఉందా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు మేలు చేయడంలో దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 56 నెలల పాలనలో అడుగులు పడ్డాయి. మంత్రి మండలిలో ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మంత్రి మండలిలో 68 శాతం పదవులూ వారికే ఇచ్చాం. ఇది సామాజికపరంగా దేశ చరిత్రలో రికార్డు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డదే. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మన పార్టీకి మండలిలో 43 మంది సభ్యులుంటే వారిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 13 జెడ్పీ చైర్మన్లలో 9 పదవులు, 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 మేయర్లు, 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకోగా వాటిలో ఏకంగా 58 మున్సిపాలిటీల్లో, 196 మార్కెట్ కమిటీల్లో 117 చైర్మన్లు, 137 కార్పొరేషన్లలో 79 చైర్మన్లు ఇలా అన్నింటా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే అవకాశం కల్పించాం. మన ప్రభుత్వం అధికారంలోకి వర్థిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా? ప్యూన్ రాకపోతే మంచినీళ్లూ పుట్టవు! చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేతకు గురైన వర్గంలో జన్మించినా, చదువుకొనేందుకు తమకు మాత్రమే హక్కుందని భావించిన వారికంటే గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేడ్కర్. ఆయన చదువుకుంటున్న రోజుల్లో దళితుడు కాబట్టి స్కూల్లో కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీళ్లు తాగేందుకు కూడా అనుమతించలేదు. ఆయన తెచ్చుకున్న గ్లాసులో ప్యూన్ పైనుంచి నీళ్లు పోసేవాడట. ఏ రోజైనా బడికి ప్యూన్ రాకపోతే ఆ రోజు తాగడానికి మంచినీళ్లు లేనట్లే అన్న మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. ప్రతి గ్రామంలో మార్పు మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ మార్పు తీసుకొచ్చింది. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ప్రతి గ్రామంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నడూ ఊహించని రీతిలో గ్రామ స్థాయిలో సాకారమైన మరో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి. -
అందరివాడు అంబేడ్కర్
ఎస్సీ, ఎస్టీలతోపాటు బలహీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంతమంది దురుద్దేశంతో అంబేడ్కర్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవకాశం కల్పిస్తున్నది. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటున్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేసిన దళితులు, ఆదివాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడపాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. నిజానికి బీసీ వాడల్లో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ –46, బలహీన వర్గాల ప్రయోజనాలను, ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి సంపూర్ణమైన అధి కారాలను ఇచ్చింది. అందుకు ప్రభుత్వం ఎటువంటి చట్టాలనైనా చేయవచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. పార్లమెంటు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్–15కు సవరణ చేసి బలహీన వర్గాలకు రక్షణ కల్పించాలి’’ అని మొట్టమొదటి రాజ్యాంగ సవరణపై బాబాసాహెబ్ అంబేడ్కర్ అత్యంత స్పష్టంగా మాట్లాడారు. సెప్టెంబర్ 16, 1921న అప్పటి జస్టిస్ పార్టీ ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, 613 నంబర్ కమ్యూనల్ జీఓను విడుదల చేసింది. ఆ రిజర్వేషన్లు రాజ్యాంగం అమ లులోకి రావడానికి ముందూ, ఆ తర్వాతా అమలు జరిగాయి. కానీ జూన్ 7, 1950న చంపకం దొరై రాజన్ మద్రాసు హైకోర్టులో ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 15 క్లాజు ప్రకారం, కులం పేరుతో వివక్ష చూపడం, అవకాశాలను నిరాకరించడం సరికాదని వాదించారు. మద్రాసు హైకోర్టు ఆమె వాదనను అంగీకరించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాజ్యాంగం స్ఫూర్తి నిజానికి అదికాదు. కానీ ఆర్టికల్ 15లో ఉన్న ఆ లొసుగును వాడుకొని రిజర్వేషన్లను కొట్టిపారేశారు. అప్పుడు కేంద్రంలో ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ, న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నారు. అందుకే ఆర్టికల్ 15ను సవరించాలని అంబేడ్కర్ సూచిం చారు. దానికి అనుగుణంగానే ఆర్టికల్‌ను సవరిస్తూ పార్లమెంటులో నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై వివరణ ఇస్తూ, అంబేడ్కర్ పైవిధంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం ప్రభుత్వానికి రిజర్వేషన్లు కొనసాగించే అధికారం ఉందని గట్టిగా వాదించారు. ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణ లేకపోతే ఎస్సీ, ఎస్టీలతో సహా బీసీలకు, మహిళలకు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఎటువంటి రిజర్వేషన్ల అవకాశం ఉండేది కాదు. సామాజిక అసమాన తల నుంచి పాక్షిక విముక్తికి ఉద్దేశించిన ఈ సవరణకు పునాది ఆర్టికల్ 46. రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్–46 ఈ రోజు ఎన్నో సంస్కరణలకు పునాది అన్నది సుస్పష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాంచల్ రాష్ట్రాలు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాల చట్టాలకు కూడా ఈ ఆర్టికల్ మాత్రమే ఆధారం. అంటే అంబేడ్కర్ దూరదృష్టితో ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ‘‘బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం విద్య, ఆర్థిక రంగాలలో ప్రత్యేక మైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత, వాటిని చాలా శ్రద్ధతో శీఘ్రగతిన అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది’’ అంటూ ఆర్టికల్ దిశానిర్దేశం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బల హీన వర్గాలు అనే పదం అంబేడ్కర్ ఉపయోగించడంలో ఉద్దేశం వెనుకబడిన కులాల కోసమేనని గుర్తుంచుకోవాలి. కొంత మంది దురుద్దేశంతో అంబేడ్కర్‌పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను ఎస్సీల కోసం మాత్రమే ఆలోచించిన నాయకుడిగా ముద్ర వేస్తున్నారు. ఇది కొన్ని దురదృష్టకరమైన సంఘటనలకు అవ కాశం కల్పిస్తున్నది. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసు కోవాలి. ఇప్పుడు మనం ఓబీసీ(ఇతర వెనుకబడిన వర్గాలు) అని పిలుస్తున్న వారి కోసం అమలులోకి వచ్చిన మండల్ కమిషన్ సిఫా రసులకు పునాది రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 అనేది మర్చిపోవద్దు. ఆయా వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికి జరిగే అధ్యయనానికి ఈ ఆర్టికల్ అవకాశం ఇచ్చింది. దీని ఆధారంగానే మొట్టమొదటి బీసీ కమిషన్ ఏర్పాటైంది. దాని పేరు కాలేకర్ కమిషన్. సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన కులాలను గుర్తించి, అధ్యయనం చేసి, వారి స్థితిగతులను ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కానీ చాలా సంవత్సరాలు ప్రభుత్వాలు దానిపైన శ్రద్ధ పెట్ట లేదు. మళ్ళీ 1979లో జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్ నాయ కత్వంలో వెనుకబడిన కులాల విద్య, సామాజిక విషయాల అధ్యయ నంపై కమిషన్‌ను నియమించింది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేస్తూ, 1980 డిసెం బర్లో మండల్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ 1990 వరకు దానిపైన ఏ ప్రభుత్వాలు స్పందించలేదు. కేంద్రంలో వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1990 ఆగస్టు 7వ తేదీన మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. దీని అమలు కోసం విధివిధానాలను రూపొందించా లని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్‌కు బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన తాత్సారం చేయడంతో ఆ బాధ్యతలను రామ్‌విలాస్ పాశ్వాన్‌కు అప్పగించారు. ఆయన దీనిపై చాలా తీవ్రగతిన అధికారులతో సమన్వయం చేసి, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే పనిని సులభతరం చేశారు. అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాం దీనిపై ఉద్యమం చేపట్టారు. ‘మండల్కో లాగ్వాకర్, నహీతో కుర్సీ ఖాళీ కరో’ అంటూ దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు పునాది రాజ్యాంగంలోని 46, 340 ఆర్టికల్స్. అంతేకాకుండా, మండల్ కమిషన్ సిఫారసులను వ్యతిరేకిస్తూ ఆధిపత్య కులాలు ఆందోళన చేస్తే, దానిని అడ్డుకున్నదీ, మండల్ కమిషన్ సిఫారసులను అమలు జరపాలని ఉద్యమాలు నిర్వహిం చిందీ, దానికి నాయకత్వం వహించిందీ దళిత సంఘాలు, సంస్థలు, కవులు, రచయితలు. ఉత్తర భారతదేశంలో ఈ సందర్భంగా అనేక చోట్ల దళితులపైన దాడులు జరిగిన విషయం గతచరిత్రను తిరగేస్తే అర్థం అవుతుంది. ఇదే సందర్భంలో దళితులపై అనేక తప్పుడు కేసులు సైతం పెట్టారు. వెనుకబడిన కులాలకు, బలహీన వర్గాలకు మంచి జరగాలని అంబేడ్కర్ నుంచి మొదలుకొని నేటి దళిత నాయకులు, కార్యకర్తల వరకు అందరూ మనసా వాచా కోరుకుంటు న్నారు. అభివృద్ధిలో ఆమడ దూరానికి నెట్టివేయబడిన దళితులు, ఆది వాసీలూ, బడుగు బలహీన వర్గాలను సమైక్యంగా ముందుకు నడ పాలన్నదే అంబేడ్కర్ ఆకాంక్ష. కానీ వెనుకబడిన కులాలు మాత్రం గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో దళితులపై దాడులు చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల అంబేడ్కర్ విగ్రహాలను పెట్టాలని దళితులు నిర్ణయిస్తే, వారిపై అమానుషంగా దాడులు చేస్తున్నారు. గత నెల దసరా రోజున తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని రామాజిపేటలో దళితులపైన బి.సి. కులాల దాడి ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా గరగ పర్రులో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించుకోవాలని దళితులు భావిస్తే, వారిని సామాజికంగా వెలివేశారు. ఇవి రెండు ఉదాహరణలుగా మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఇటువంటి ఘటనలే చాలా చోట్ల జరి గాయి, జరుగుతున్నాయి. రామాజిపేటలో ఇళ్ళపై దాడిచేసి మహిళ లను, పిల్లలను కొట్టడం, వాహనాలను, వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు సమయానికి వెళ్ళకపోయి ఉంటే, కారంచేడును మించిన మారణకాండ జరిగేదని బాధితులు ఏడుస్తూ చెప్పడం కలవరపరుస్తున్నది. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మేలు చేశారనే ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. నిజానికి దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన కృషి ఎవ్వరూ మరువలేనిది. ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని విద్యావంతులు, సంఘాల పెద్దలు తమతమ సామాజిక వర్గాలలోని ప్రజలకు, ప్రత్యేకించి యువకులకు తమ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళ గురించి చెప్పాలి. అంత కన్నా ముఖ్యంగా ప్రజల మధ్య కులాల విభేదాలు ఉన్నాయి. అవి విద్వేషాలుగా మారకూడదు. అసమానతల తొలగింపులో ప్రధాన అడ్డంకిని మరువకూడదు. బలహీనవర్గాల పక్షాన నిలిచి పోరాడిన అంబేడ్కర్‌ను విస్మరించడం, ఆయన భావజాలాన్ని అడ్డుకోవడం, విగ్రహాలను పెట్టనివ్వకపోవడం ఎంతమాత్రం విజ్ఞత అనిపించు కోదు. చరిత్రను తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడం వివేక వంతులు చేసే పని. ఇకనైనా కలిసికట్టుగా ప్రయత్నం మొదలవ్వాల్సిన సందర్భమిదే. నిజానికి బీసీల మది మదిలో అంబేడ్కర్‌ని నిలుపు కోవాలి. బీసీ వాడల్లో ఆయన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
బాబా సాహెబ్ అంబేద్కర్‌ను స్మరించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌ను స్మరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో ప్రజాస్వామిక విలువలకు పునాది వేస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. -
అన్నీ ఉన్నవారికీ కావాలి కోటా!
రాజకీయ పలుకుబడి గల మరాఠాలు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరడం విచిత్రం. గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు శాసించేది వారే. విద్యా సామ్రాజ్యాల స్వాధీనం లేదా ఫీజులలో రాయితీలు వారు కోరడం లేదు! మరాఠాలు ఒకప్పటి యుద్ధ యోధులు, రైతులతో కూడిన వారు. అలా అని ఆ రెండు వర్గాలూ పూర్తిగా వేరు వేరుగా ఉండేవీ కావు. మహారాష్ట్ర అధికార వ్యవస్థలో కీలక స్థానం మాత్రం మొత్తంగా మరాఠాలదే. వారే తరచుగా ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారు. జనాభాలో దాదాపు మూడోవంతు ఉంటారు. అయినా వారికి పలు సమస్యలున్నాయి, అందులో ఒకటి వారికి రిజర్వేషన్లు లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లనే చేస్తున్న జాట్లు, పటేళ్ల లాగే మరాఠాల తీరూ విడ్డూరమే. ఆగస్టు నుంచి అపూర్వమైన రీతిలో వారు తమ డిమాండ్లను వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల నినాదాలు, మైక్రోఫోన్లు లేకుండా ప్రదర్శనలను నిర్వహించారు. ఒక్క నినాదం కూడా వినరాలేదు. ఒక్క నేతైనా వేదిక మీద మైక్ అందుకున్నది లేదు. కోటాలు కావాలని, దళితులపై అత్యాచారాల చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఒక మరాఠీ బాధితురాలుగా ఉన్న సామూహిక అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్‌పై తేల్చా లని ప్లకార్డులను ప్రదర్శించారు. పలు విధాలుగా ఈ ప్రదర్శనలు అపూర్వమైనవి. ఒకటి, వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్లారా చూస్తేనే అది నమ్మగలం. లక్షలను రెండు అంకెల్లో చెబుతున్నట్టు మీడియా వారి సంఖ్యను తక్కువగా పేర్కొంది. రెండు, ఏ రాజకీయ నేతో లేదా ఏ రాజకీయ పార్టీనో సంఘటితపరచడం లేదా నేతృత్వం వహిస్తు న్నట్టు కానరాలేదు. మూడు, అధికారులతో సంఘర్ష ణకు దారి తీసిన ఘటన ఒక్కటీ జరగలేదు. ప్రదర్శకుల మధ్య సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించ లేదు. నాయకులంతా అస్పష్టంగానే గోచరమయ్యారు. అంతా రాజకీయాలకు అతీతంగా ఒకే విధమైన ప్రయో జనాలు, ఉద్దేశం ఉన్నవారు. ప్రదర్శనల తేదీలు, వేళలు, స్థలాలు, మార్గాలు, ఏర్పాట్లు, వగైరా అన్నీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే అందరికీ చేరాయి. భాగ స్వాములైన వారిలో ప్రతి ఒక్కరూ మరో 100 మందిని సమీ కరిస్తామని వాగ్దానం చేశారు. వేదికలనుంచి నల్ల దుస్తులు ధరించిన బాలికలు మరాఠాల డిమాండ్ల చదివి వినిపించారంతే. అవన్నీ ప్లకార్డులపై ఉన్నవే. అధికారులు తమ మధ్య చీలికలను సృష్టించడానికి యత్నిస్తారని నాయకత్వం తెరవెనుకనే ఉండిపోయింద నేది స్పష్టమే. అయితే, రాజకీయవేత్తలు వారిలో తప్పక ఉన్నారు. అవసరమైన డబ్బును, సీసాల్లోని మంచినీటిని వారే సమకూర్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు తెరవెనుక ఒకరిని మించి మరొకరు ఈ ప్రదర్శన లకు సహాయం అందించాలని పోటీపడి ఉంటారు, ఎవరికి వారే పైచేయి సాధించాలని యత్నించి ఉంటారు. అందువల్ల లాభపడింది ప్రదర్శకులు మాత్రమే. కీలక సమస్యలపై రాజకీయాలను దూరంగా ఉంచే ధోరణి ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో ఉంది. దివంగత శరద్ జోషి ఈ విధంగానే అందరినీ షేత్కారీ సంఘటనలోకి సమీకరించి, నేతృత్వం వహిం చారు. ‘‘ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పడు మీరు మీ రాజకీయ పాదరక్షలను బయటే వదలి రండి’’ అంటూ రైతులనుద్దేశించి ప్రకటిస్తూ ఆయన తన సభలను ప్రారంభించేవారు. అయితే ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, తాను పరిహసించిన పార్టీల మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1980లలో దళితులు కూడా రిపబ్లికన్ పార్టీలోని చీలికలకు అతీతంగా ఏకమై, తమను అవమానాలకు గురిచేస్తున్న మరాఠాలకు వ్యతిరేకంగా సమరశీల పోరా టాన్ని నిర్వహించారు. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్పించారు. దళితులు తమపై అత్యాచారాల చట్టాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని మార్చాలని నేడు మరా ఠాల కోరికల జాబితా కోరుతోంది. దీంతో ఒక సంక్ర మణం పూర్తయిందని అనుకోవచ్చు. రాజకీయ పలుకుబడి కలిగిన మరాఠాలు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లును కోరడం అతి విచిత్రం. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారాన్ని శాసించేది వారే. పేరుకు ఒక వీపీ నాయక్ లేదా సుధాకర్ నాయక్ లేదంటే మనోహర్ జోషి లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కావచ్చు. కాసులు కురిపించే విద్యాసంస్థలకు యజమానులు, నిర్వాహకులుగా ఉన్నవారు కూడా మరాఠాలకు చెందినవారే. కాలక్రమంలో మరాఠాల అధికారం పదును సరిగ్గా ఎప్పుడు తగ్గిందో చెప్పడం కష్టం. అధికార చట్రానికి, ప్రగతికి తమను దూరంగా ఉంచుతున్నారన్న భావన ఏర్పడింది. తమ కులానికే చెందిన పెద్దలు రాజకీయాలను వ్యాపారంగా నిర్వహిం చినా... మరాఠాల ఆర్థిక ప్రయోజనాల పట్ల వారు శ్రద్ధ వహిస్తున్నంతకాలం దాన్ని పట్టించుకోరు అన్నట్టుంది. విద్యా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని లేదా ఫీజులలో రాయితీలు ఇవ్వాలని వారు కోరడం లేదు. అది ఆసక్తికరం అనడం ఈ విషయాన్ని తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
నిరంతర స్ఫూర్తి ప్రదాత
సందర్భం నూట ఇరవై అయిదేళ్ల క్రితం భార తీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు- అంబేడ్కర్. 125 ఏళ్ల తరువాత... ఈ 125 కోట్ల మహా భార తానికి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశ గతిరీతులకు విధాత. నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ణేత. కులం పునాదులను పెకలిం చాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకా రులకు మహోపాధ్యాయుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక. ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింప చేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ, ఆర్థిక విధానాలకూ నిత్య నిర్దేశకుడు అంబేడ్కరే. ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి. ఆయన రాసిన ప్రతి అక్షరం, పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం. ఆ నిత్య స్ఫూర్తిమంతుని 125వ జయంతిని జరుపుకోవడం, సేవలను మననం చేసుకోవడం ఒక గొప్ప అనుభవం. చారిత్రక అవసరం. అస్పృశ్యతా శాపానికి గురైన మహర్ కుటుంబంలో పుట్టిన అంబేడ్కర్, ఆ వర్గంలో మెట్రిక్యులేషన్ చేసిన మొదటి విద్యార్థి. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో ముంబైలో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా) వెళ్లారు. అక్కడ ఉన్నా భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించేవారు. ‘సంఘా నికి సంబంధించినంతవరకు అస్పృశ్యులు వేరు కాదు. వారు భార తీయ సంస్కృతిలో అవిభక్త భాగమే’ అని ‘ఇండియన్ రేస్’ అనే తన వ్యాసంలో స్పష్టం చేశారు. తరువాత ఆయన చేసిన పరిశోధన లకు ఈ సిద్ధాంతమే ఆధారం. బైండ్ రసెల్ రాసిన ‘రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ’ మీద అంబేడ్కర్ రాసిన పరిశీలనాత్మక వ్యాసం అమెరికాలో ప్రశంసలు అందుకుంది. అమెరికా విద్య తరువాత 1920లో లండన్ వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ లైబ్రరీని జీవిత సర్వస్వంగా మార్చుకున్నారు. రెండున్నర సంవత్సరాలలో రెండు డిగ్రీలు పూర్తిచేశారు. ‘ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ అనే అంశం మీద పరిశోధక పత్రం సమర్పించినందుకు 1921లో ఎమ్మెస్ డిగ్రీ, ‘ది ప్రోబ్లెమ్ ఆఫ్ ది రూపీ’ అనే అంశం మీద సమర్పించిన పత్రానికి డాక్టర్ ఆఫ్ సెన్సైస్ (డీయస్సీ) డిగ్రీ (1922) లభించాయి. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త హెరాల్డ్ జె లాస్కీ ప్రశంసలు పొందిన ఏకైక భారతీయుడు డాక్టర్ అంబేడ్కర్. అదే సమయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అంబేడ్కర్ స్వదేశానికి వచ్చిన తరువాత 1927లో న్యాయ వాద వృత్తిని చేపట్టారు. అదే సమయంలో బొంబాయి విధాన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆర్థిక అంశాల మీద అపరిమితమైన పరిజ్ఞానం కలిగిన డాక్టర్ అంబేడ్కర్ మండలిలో బడ్జెట్ మీద చేసిన మొదటి ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుకు ప్రభు త్వం ధర్మకర్తగా ఉండాలే తప్ప దుబారా చేస్తే, తన పరిధులు దాటి ప్రవర్తించడమవుతుందని అప్పట్లోనే అంబేడ్కర్ చెప్పారు. అయితే అస్పృశ్యుడయినందున ఆ రోజుల్లో కొన్ని పత్రికలు వ్యతి రేకంగా ఉండేవని ఆయనే చెప్పుకున్నారు. తన మీద వచ్చే విమర్శలకు జవాబు ఇవ్వడానికీ, తన ఉద్యమాన్ని అభిప్రాయా లనూ ప్రచారం చేయడానికీ ‘బహిష్కృత భారతి’ అనే పత్రికను స్థాపించారు. భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న రౌండ్ టేబుల్ సమావేశాలకు (1930) అంబేడ్కర్ లండన్ వె ళ్లారు. ఆంగ్లేయులు అస్పృశ్యులకు ఎంతటి నమ్మకద్రోహం చేశారో ఘాటుగా విమర్శిం చారాయన. ‘భారతదేశంలో సిక్కులు, ముస్లింలు మినహా మిగిలి నవారంతా హిందువులే. అయినప్పటికీ అటు హిందువులతో గానీ, ఇటు సిక్కులతో గానీ సంబంధ బాంధవ్యాలు లేని ఒక ప్రత్యేక తెగ ఉన్నది. అటు సేవకులుగా కాకుండా, ఇటు బాని సలుగా కాకుండా వారిని ఒక ప్రత్యేక తెగలా చూస్తున్నారు. ప్రపం చంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యత అనే సాంఘిక దురాచా రంతో అడుగడుగునా అవమానిస్తున్నారు. వారు చాలా దయనీ యమైన జీవితం గడుపుతున్నారు. అటువంటి ఈ దేశాన్ని సుమారు 150 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ‘మీరు’ (ఆంగ్లే యులు) ఈ అస్పృశ్యతను నివారించేందుకు ప్రయత్నించడం లేదు. సరికదా, దానిపై మీకు కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం’ అని ఎలుగెత్తి చాటిన ధీశాలి అంబేడ్కర్. ఈ మాటలు బ్రిటిష్ ప్రధానిని ఎంతో ప్రభావితం చేశాయి. తరువాత అంబేడ్కర్ మైనారిటీస్ కమిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ‘కమ్యూనల్ అవార్డ్’ను ప్రకటించింది. దాని ప్రకారం భారతదేశంలో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం కొన్ని ప్రత్యేక స్థానాలను నిమ్నజాతులకు కేటా యించాలి. అయితే, ఈ ప్రతిపాదనతో హిందూ సమాజం రెండుగా చీలిపోతుందన్న అభిప్రా యంతో ఎరవాడ జైలులో ఉన్న గాంధీజీ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌ను సంప్రదించారు. పూనా ఒడంబడిక జరిగింది. ఆ విధంగా కమ్యూనల్ అవార్డ్ అమలులోకి వచ్చాక రిజ ర్వుడు స్థానాలు ఉనికిలోకి వచ్చాయి. మహా రాష్ట్రలో అంబేడ్కర్ స్థాపించిన ఇండియన్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించి శాసన సభలో అడుగుపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగ రచన గురించి చర్చ జరిగింది. అరబ్ దేశాలకు రాజ్యాంగం రాసిన సర్ ఐవరీ జెన్నింగ్స్తో రాయించాలని కొందరు ప్రతిపాదించారు. కానీ దేశ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్న అంబేడ్కర్ ఉండగా, ఒక విదేశీయునితో రాజ్యాంగం రాయించే ప్రతిపాదన సరికాదని గాంధీజీ వాదించారు. వారి మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్ప టికీ అంబేడ్కర్ సమర్థత తెలిసిన గాంధీజీ రాజ్యాంగ రచన బాధ్యతను ఆయనకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. జాతి, కుల, మత వివక్ష లేకుండా అందరికీ సమంగా వర్తించే ప్రాథమిక హక్కులను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరి చారు. అణగారిని కులాలకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న సూత్రాన్ని రాజ్యాంగంలో పొందు పరిచినందువల్లనే మన ప్రజాస్వామ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పంచాయతీలు మొదలు పార్లమెంట్ వరకు అన్ని వర్గాల వాణి వినపడడానికి కారణం అదే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫెడరల్ స్ఫూర్తితో పని చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన విభజనతో అధికారాలు, బాధ్యతలను అప్పగించారు అంబేడ్కర్. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల మధ్య అధికారాలు, బాధ్యతలను విభజించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ సమన్వయంతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పోగొట్టుకోకుండానే భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా రాజ్యాంగం నిలబెట్టింది. భారత రాజ్యాంగం దృఢమైనది. అదే సమయంలో కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వీలైనది. అందుకే వందకుపైగా సవరణలు జరిగినప్పటికీ ప్రపంచంలోనే పటిష్టమైన రాజ్యాంగంగా నిలవగలిగింది. ఈ ఘనత అంబేడ్కర్‌దే. రిజర్వు బ్యాంక్ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉంది. అందరికీ సమానావకాశాలు అందించే ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేయాలన్నదే ఆయన ఆశయం. డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి మొబైల్: 99890 24579) -
సమతా విప్లవ దార్శనికుడు
కొత్త కోణం దేశ వనరులపై సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వానికే హక్కులుండాలన్న అంబేడ్కర్‌కు పెట్టుబడిదారీ విధానంపై సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం ఉమ్మడి శత్రువులనీ, రెండూ అసమానతలను పెంచి, పరిర క్షించేవేనని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారీ విధానాన్ని కుల వ్యవస్థ మరింత క్రూరంగా అమలు చేస్తుందన్నారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగలిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ‘‘ప్రజాస్వామ్యం ఒక మనిషి-ఒక విలువ అన్న సూత్రానికి అనుగుణంగా నిలవాలంటే ఆర్థిక రంగాన్ని కూడా అలాగే నిర్వచించుకోవాలి. అనువైన వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజాస్వామ్యం నిజమవ్వాలంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడం, నియంతృత్వాన్ని తిరస్కరించడం, సామ్యవాదాన్ని స్థాపిం చడం దీనికి పరిష్కారం’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆర్థిక విధా నాన్ని ప్రకటించారు. రాజకీయ ప్రజాస్వామ్యంతోనే సమానత్వం సాధ్యం కాదని, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించాలని అంబేడ్కర్ చాలా సార్లు వివరించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ‘రాష్ట్రాలు-మైనారిటీలు’ (స్టేట్స్ అండ్ మైనారిటీస్) అనే డాక్యుమెంట్లో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే ఇందులో ఉన్న చాలా అంశాలు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి వీలుకానివి. అటువంటి అంశాల్లో ముఖ్యమైనవి స్టేట్ సోషలిజం. పరిశ్ర మలు, సేవారంగం, ఆర్థిక సంస్కరణలు. భూమితో పాటూ ఇతర వనరుల న్నిటినీ ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించి, అదే వాటిని నిర్వహించాలనీ అప్పుడే ప్రజల మధ్య అంతరాల తొలగింపు సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ‘అంబేడ్కర్ స్టేట్ సోషలిజం’గా పిలుస్తారు. అంబేడ్కర్ స్టేట్ సోషలిజం ఈ డాక్యుమెంటులోని నాలుగవ భాగంలో ఆర్థిక దోపిడీ నుంచి రక్షణలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. అవి: 1. ప్రధాన పరిశ్రమలను నిర్వచించి, వాటినన్నిటినీ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడపాలి. 2. మౌలిక పరిశ్రమలను ప్రభుత్వాలు లేదా అవి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు మాత్రమే నిర్వహించాలి. 3. బీమారంగాన్ని ప్రభుత్వాల ఆధీనంలోనే ఉంచి, వయోజనులంతా వారి సంపాదనకు సరిపోయేంతటి బీమా చేసేలా చట్టా లను రూపొందించాలి. 4. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చాలి. అది ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి. అందుకుగాను భూమిని జాతీయం చేయాలి. ఇంతవరకు యజమానులుగా, కౌలుదార్లుగా, తన భూమిపైన హక్కులు అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తులకు డిబెంచర్ల రూపంలో వారి హక్కులకు సరిపడా నష్టపరిహారం చెల్లించాలి. సమాజంలోని వనరులపైన సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభు త్వాలే హక్కులను కలిగి ఉండాలని అంబేడ్కర్ ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో చేర్చడానికి నాటి రాజ్యాంగ సభ నాయకత్వం అంగీకరించ లేదు. అంబేడ్కర్ చెప్పినట్టుగా పరిశ్రమలు, బ్యాంకులు, బీమా సంస్థలను కొంతకాలం ప్రభుత్వాలు నడిపాయి. కాలక్రమేణా అవి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. భూమికి సంబంధించిన ఆయన ఆలోచనలు ఏ ప్రభుత్వా లకూ పట్టలేదు. భూసంస్కరణల కోసం దున్నేవానికే భూమి నినాదాన్ని ఇచ్చిన కమ్యూనిస్టులు భూమి జాతీయీకరణను పట్టించుకోలేదు. పైగా దున్నేవానికే భూమి విధానం వల్ల అప్పటి వరకు జాగీర్దారులు, జమీందా రులు, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమి కౌలుదారులుగా, వ్యవసాయదా రులుగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. అంబేడ్కర్ కోరినట్లు భూమిని జాతీయం చేసి సమష్టి వ్యవసాయ విధానాన్ని కొనసాగించి ఉంటే... ప్రజల మధ్య అంతరాలు ఇంతగా పెరిగి ఉండేవి కాదనేది వాస్తవం. జాగీర్దారీ, జమీందారీ భూములపై యాజమాన్యం సాధించిన పై కులాలకు నీటి పారు దల సౌకర్యాలు, సబ్సిడీ ఎరువులు, పురుగు మందులు, బ్యాంకు రుణాలు అందుబాటులోకి రావడంతో సస్యవిప్లవం ద్వారా వారు సంపన్నులయ్యారు. ఆ సంపన్నులే క్రమంగా వ్యాపారాలు, సినిమాలు, కాంట్రాక్టులు తదితర రంగాల్లోకి విస్తరించి, రాజకీయ రంగాన్ని స్వాధీనం చేసుకొన్నారు. సామా జిక వ్యవస్థలో ఆధిపత్యంలో ఉన్న కులాలే ఆర్థిక రంగాన్ని సైతం ఆక్రమించి, రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాలే అధికారాన్ని చలాయిస్తున్నాయి. జాతీయీకరణే ఆర్థిక ప్రజాస్వామ్యానికి మార్గం ఈ పరిణామాలను ఊహించే అంబేడ్కర్ మౌలిక పరిశ్రమలు, కీలక ఆర్థిక సంస్థలతో పాటు భూమిని జాతీయం చేయాలన్నారు. దానికి అనుగుణంగానే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ - 38ని ఆదేశిక సూత్రాలలో చేర్చడాన్ని ఆర్థిక ప్రజాస్వామ్య సాధనా కృషిలో భాగంగానే చూడాలి. 38వ ఆర్టికల్ క్లాజు-2లో పేర్కొన్నట్టు, ప్రజల ఆదా యాలలో ఉన్న అసమానతలను తొలగించానికీ, హోదాలు, సౌకర్యాలు, అవకాశాలలో ఉన్న అంతరాలను నిర్మూలించడానికీ రాజ్యం కృషి చేయా లనేది అంబేడ్కర్ లక్ష్యం. ‘‘మన లక్ష్యమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా కలిగిన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చాలా విలువైనవని నా అభిప్రా యం. ఎందుకంటే, కేవలం పార్లమెంటరీ తరహా పాలన వల్ల మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. ఆర్థిక రంగంలో సమానత్వం కోసమే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచాం’’ అన్న మాటలు అంబేడ్కర్ ఆర్థిక విధానానికి అద్దం పడతాయి. ‘‘స్టేట్ సోషలిజం భారత దేశపు సత్వర పారిశ్రామిక అభివృద్ధికి అత్య వసరం. ప్రైవేట్ వ్యాపార వర్గానికి అంతటి సామర్థ్యం లేదు. ఒకవేళ ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చినా దానివల్ల సంపదలో అసమానతలు పెరిగిపో తాయి. యూరప్‌లో ప్రైవేట్ పెట్టుబడులు సృష్టించిన అసమానతలు భారతీ యులకు గుణపాఠం కావాలి’’ అంటూ ఆనాడే అంబేడ్కర్ హెచ్చరించారు. ప్రైవేట్ రంగం ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను, భూములను తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో ఆనాడే సోదాహరణంగా వివరించారు. అవి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ’’ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆరాటం, సరిపడని జీతం, పరిమితిలేని పని గంటలు, కార్మిక సంఘాల్లో చేరే హక్కు మీద ఆంక్షలూ, కార్మిక కూలీ వర్గం భావప్రకటనా స్వేచ్ఛ, సంఘాన్ని ఏర్పర్చుకునే హక్కు, మత స్వేచ్ఛ వంటి వాటిపై దాడులూ జరుగుతుంటే మనుషులు ఏమైపోతారు’’ అన్న మాటలు నేటి ఉదారవాద ఆర్థిక విధానాలకు సరిగ్గా సరిపోతాయి. ప్రైవేటైజేషన్‌పై నాటి అంబేడ్కర్ అభిప్రాయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నేడు దేశంలో అమలులో ఉన్న పారిశ్రామిక విధానం, ప్రత్యేకించి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు తర్వాత కార్మికవర్గంలో అభద్రత నెలకొంది. స్టేట్ సోషలిజం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేది కాదని, నిజానికి అది వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తుందనీ, ఇతరుల చేతుల్లో దోపిడీకి గురికావడం నుంచి కాపాడుతుందనీ ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారీ దోపిడీని బలోపేతం చేసే కులం పెట్టుబడిదారీ విధానంపై అంబేడ్కర్‌కు సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. భారత ప్రజలకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం రెండూ ఉమ్మడి శత్రువులనీ, రెండింటిలో ఉన్న సామ్యం అసమానతలను పెంచి, పరిర క్షించడమని ఆయన స్పష్టం చేశారు. కుల వ్యవస్థ పెట్టుబడిదారీ విధానాన్ని మరింత క్రూరంగా, అవమానంగా అమలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే నేడు రుజువైంది. నేటి బ్రాహ్మణవాదం కుల వ్యవస్థ, పెట్టుబడిదారీ విధానం కలగ లిసిన ఆర్థిక ఆధిపత్య భావజాలం. ఇటీవల కొందరు దళిత పెట్టుబడి దారులనే వాదనను ముందుకు తెస్తూ, దాన్ని అంబేడ్కర్ సిద్ధాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దళితుల ఆర్థిక సాధికారత అంటే గుప్పెడు మంది పురోగతి కాదు. ఇక ప్రపంచీకరణ వల్ల దళితులు అభివృద్ధి చెందు తారనే మాయావాదం పూర్తి సైద్ధాంతిక దౌర్భాగ్యం. ఒకరో, ఇద్దరో దళితులు పారిశ్రామికవేత్తలు కావచ్చునేమో... అంతమాత్రాన దానినే సార్వత్రిక సత్యంగా ప్రచారం చేయడం అంబేడ్కర్ పేరును తమ స్వార్థానికి వాడు కోవడం మాత్రమే. దేశంలోని కొన్ని కులాలు మాత్రమే పెట్టుబడిదారీ రంగం లోకి, పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థలలోకి ప్రవేశిస్తున్నాయి. అసమానతకు పునాదిగా ఉన్న కుల వ్యవస్థకు పరిష్కారంగా అంబేడ్కర్ స్వేచ్ఛ, సమా నత్వం, సోదరత్వం లక్ష్యాలను ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం లాంటి విషయాలపట్ల అంతర్జాతీయంగా ఒకే రకమైన భావన ఉంటుంది. అయితే మన దేశంలో సోదరత్వంతో పాటూ ఈ రెండూ ప్రత్యేక స్వభావంగలవే. అంబేడ్కర్ మాటల్లో చెప్పాలంటే, సోదరత్వానికి మరోపేరు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే కేవలం ఒక పరిపాలనా విధానం, రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం ప్రజల జీవితంలో భాగంగా ఉండాలి. అంతా సమానులేననే భావన అందరికీ ఉండాలి. అందుకే అంబేడ్కర్ సోదరత్వ సాధనకు కుల నిర్మూలనను ప్రతిపాదించారు. సోషలిజాన్ని, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సవివరంగా విశ్లేషించి, సకల రంగాల్లో ప్రజాస్వామ్యం నెలకొనాలని ఆశించిన అంబేడ్కర్‌ని సంఘసంస్కర్తగానో, పెట్టీ బూర్జువా గానో భావించడంలో అర్థం లేదు. ఆయన సమసమాజాన్ని స్వప్నించిన నిజమైన విప్లవకారుడు. నేడు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
నేడు ‘రాజ్యాంగం’పై సెమినార్
సిర్పూర్(టి) : ప్రపంచంలోనే అతి పెద్ద దృఢ, అధృడ రాజ్యాంగం.. భారత రాజ్యాంగం. దీనికి బుధవారంతో 65 ఏళ్లు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌కు అందజేసిన భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించిన మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రచించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దర్శనీయకత నేటికి సజీవంగా ఉంది. తొలి నాళ్లలో 395 నిబంధనలు 8 షెడ్యుళ్లు ఉన్న రాజ్యాంగం తదనంతర కాలంలో 450 నిబంధనలు 12 షెడ్యుళ్లుగా మారింది. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని నేటి విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో జనవరి 26 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రఇంటలెక్చువల్ ఫోరం, దళిత సాహిత్య అకాడమీ, బిడారు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఐనాల సైదులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో డాక్టర్ వీఆర్.అంబేద్కర్ - భారత రాజ్యాంగం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ సుదర్శన్, ప్రముఖ ఇంజినీర్ భయ్యాజి రాంటెంకి (చంద్రాపూర్), ఎస్.హరినాథ్ (హైదరాబాద్) తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. -
అంబేద్కర్‌కు ఘన నివాళి
సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుయాయులు అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎక్కడా చూసిన లౌడ్ స్పీకర్లలో ఆయన జీవిత చరిత్ర తెలిపే పాటలు వినిపించాయి. దాదర్‌లోని చైత్యభూమిలోని అంబేద్కర్ విగ్రహనికి సోమవారం ఉదయం గవర్నర్ శంకర్నారాయణన్, హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీఎంసీ కమిషషర్ సీతారాం కుంటే, స్థాయీ సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే, వివిధ పార్టీలకు చెందిన నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కొల్హాపూర్‌లో...: స్థానిక బిందు చౌక్‌వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మేయర్ సునీత రావుత్, కార్మిక శాఖ మంత్రి హసన్ మశ్రీప్ తదితరులు నివాళులర్పించారు. ఆంధ్ర ప్రజా సంఘం హాలులో... ముంబైలోని ఆంధ్ర ప్రజా సంఘం హాలులో అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి వీజే రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్, మహాత్మా పూలే, బుద్ధ భగవాన్, శివాజీ మహరాజ్ చిత్రపటాలకు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అధ్యక్షుడు జె.మన్మథరావు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో డీవీ రావు, ఎం.సాయి సారథి, జేవీ మూర్తి విశ్వనాధ్, టి.ప్రకాశ్ పాల్గొన్నారు. తూర్పుడోంబివల్పిలో... తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక, శ్రమజీవి సంఘం సంయుక్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సోమవారం నిర్వహించారు. తూర్పుడోంబివలిలోని అయిరే గావ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ దుర్గేష్ అక్కెనపెల్లి మాట్లాడుతూ...సమాజానికి పట్టిన రుగ్మతలను తొలగించడానికి బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారన్నారు. ఆయన కన్న కలలను నిజం చేసిననాడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు గడచినా అంటరానితనం, మూఢ నమ్మకాలుసమసిపోలేదని రమేష్ గొండ్యాల విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్ గంబ్రె, నార్ల సతీష్, అల్లి మల్ల్లేష్, శ్రీమల్, సంఘ నాయకులు పాల్గొన్నారు. తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో... తెలుగు కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్లో సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. దళితులు, బహుజనులకు మాత్రమే కాకుండా ప్రతి వర్గానికి సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొంపల్లి జాన్, ఉపాధ్యక్షులు ఆరే కృపానందం, కార్యదర్శి బత్తుల లింగం, కోశాధికారి సంఘం ప్రభాకర్, మగ్గిడి, రవి, సభ్యులు సంగేమ్, వినోద్ బాస, మహేష్, తలారి ఆనందం, బొండొల్ల సుదర్శన్, కొలి గంగారాంలు పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కు ఘననివాళి
సాక్షి, ముంబై: భారత రాజ్యాంగ రూపకర్త, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దాదర్, శివాజీపార్కు పరిసరాలు శుక్రవారం జనసంద్రమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచితరలివచ్చిన లక్షలాది అంబేద్కర్ అభిమానులు ైచె త్యభూమిని సందర్శించారు. గంటల తరబడి ఎంతో ఓపికగా క్యూలో నిలబడి తమ ఆరాధ్యదైవానికి ఘన నివాళులర్పించారు. అభిమానులతోపాటు రాష్ట్ర మంత్రులు కూడా ఉదయమే చైత్యభూమికి వచ్చి ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే, బీజేపీ నాయకులు గోపీనాథ్ ముండే, దేవేంద్ర ఫడణవిస్, వినోద్ తావ్డే, ఆనంద్‌రాజ్ అంబేద్కర్ తదితర ప్రముఖులు చైత్యభూమిని సందర్శించి నివాళులర్పించారు. కాగా అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులపై ముంబై జిల్లా ఇంచార్జి మంత్రి జయంత్ పాటిల్, గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ లు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. కాగా తెల్లవారు జామునే చైత్యభూమిని దర్శించుకోవాలనే తపనతో అనేకమంది ముందురోజు సాయంత్రం నుంచే క్యూలో నిలబడ్డారు. ఇటు సిద్ధివినాయక్ మందిరం నుంచి సెంచురీ బజార్‌తోపాటు అటు మాహీందాకా ఇరువైపులా భారీ క్యూలు కనిపించాయి. ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులకుతోడుగా వివిధ స్వయం సేవా సంస్థల కార్యకర్తలు సేవలందించారు. దాదర్ స్టేషన్లో రైలు దిగి వచ్చే జనానికి మార్గదర్శనం చేసేందుకు అక్కడక్కడా స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన కార్యకర్తలను నియమించారు. దాదర్, శివాజీపార్కు పరిసరాల్లో ట్రాఫిక్ అంక్షలు అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా దాదర్ నుంచి శివాజీపార్కు దిశగా వచ్చే ప్రధాన రహదారులు మొదలుకుని చిన్న రహదారులదాకా వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించారు. కొన్ని రోడ్లను వన్ వే గా, మరికొన్నింటిని పూర్తిగా నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. శివాజీపార్కు మీదుగా ప్రభాదేవి నుంచి మాహిం దిశగా వెళ్లే రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించేందుకు వందలాది ట్రాఫిక్ శాఖ పోలీసులను నియమించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇసుకవేస్తే రాలనంత జనం రావడంతో చైత్యభూమి పరిసరాలు కిటకిటలాడాయి. జై భీం నామస్మరణతో మార్మోగిపోయాయి. దీవాలో ఉద్రిక్తత అంబేద్కర్ చిత్రపటం ఉన్న పోస్టర్లు తొలగించినందుకు దీవా రైల్వే స్టేషన్లో గంటన్నర సేపు రైలురోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఆకస్మాత్తుగా చేపట్టిన ఈ రైలు రోకోవల్ల పిల్ల్లాపాపలతో బయటపడిన ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. కొందరు అంబేద్కర్ అభిమానులు రైలు పట్టాలకు సమీపంలోనే బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగే ఆస్కారముందని రైలు నడిపే మోటర్మెన్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబేద్కర్ వాదులు రైలురోకోకు దిగారు. నచ్చజెప్పినప్పటికీ ఆందోళనకారులు తప్పుకోలేదు. దీంతో కొందరిని అదుపులోకి తీసుకుని మిగతావారిని నెట్టేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సహనం అవసరం: మంత్రి సచిన్ అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని నిర్మించడమనేది భారీ ప్రక్రియ అని. అందువల్ల తొందరపడితే లాభం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి సచిన్ అహిర్ పేర్కొన్నారు. చైత్యభూమిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఇందుకు సంబంధించిన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభమవుతాయన్నారు. ప్రత్యేక రైళ్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నగరానికి లక్షలాదిగా తరలివచ్చిన అంబేద్కర్ అభిమానులు తిరిగి తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను నడుపుతోంది. నాగపూర్, ఔరంగాబాద్, జాల్నా, పర్భణి, నాందేడ్, భుసావల్, చాలిస్గావ్, విదర్భ, మరఠ్వాడా తదితర ప్రాంతాలకు శుక్ర, శని, ఆదివారాలు ప్రత్యేక రైళ్లను నడపనుంది. సీఎస్టీ నుంచి సేవాగ్రాం, దాదర్ నుంచి నాగపూర్, లోక్మాన్య తిలక్ టెర్మినస్ నుంచి అజనీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.