అన్నీ ఉన్నవారికీ కావాలి కోటా!
రాజకీయ పలుకుబడి గల మరాఠాలు విద్యాసంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కోరడం విచిత్రం. గ్రామం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు శాసించేది వారే. విద్యా సామ్రాజ్యాల స్వాధీనం లేదా ఫీజులలో రాయితీలు వారు కోరడం లేదు!
మరాఠాలు ఒకప్పటి యుద్ధ యోధులు, రైతులతో కూడిన వారు. అలా అని ఆ రెండు వర్గాలూ పూర్తిగా వేరు వేరుగా ఉండేవీ కావు. మహారాష్ట్ర అధికార వ్యవస్థలో కీలక స్థానం మాత్రం మొత్తంగా మరాఠాలదే. వారే తరచుగా ప్రభుత్వానికి నేతృత్వం వహించేవారు. జనాభాలో దాదాపు మూడోవంతు ఉంటారు. అయినా వారికి పలు సమస్యలున్నాయి, అందులో ఒకటి వారికి రిజర్వేషన్లు లేకపోవడం. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి డిమాండ్లనే చేస్తున్న జాట్లు, పటేళ్ల లాగే మరాఠాల తీరూ విడ్డూరమే. ఆగస్టు నుంచి అపూర్వమైన రీతిలో వారు తమ డిమాండ్లను వ్యక్తం చేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల నినాదాలు, మైక్రోఫోన్లు లేకుండా ప్రదర్శనలను నిర్వహించారు. ఒక్క నినాదం కూడా వినరాలేదు. ఒక్క నేతైనా వేదిక మీద మైక్ అందుకున్నది లేదు. కోటాలు కావాలని, దళితులపై అత్యాచారాల చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలని, ఒక మరాఠీ బాధితురాలుగా ఉన్న సామూహిక అత్యాచారం కేసును ఫాస్ట్‌ట్రాక్‌పై తేల్చా లని ప్లకార్డులను ప్రదర్శించారు.
పలు విధాలుగా ఈ ప్రదర్శనలు అపూర్వమైనవి. ఒకటి, వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కళ్లారా చూస్తేనే అది నమ్మగలం. లక్షలను రెండు అంకెల్లో చెబుతున్నట్టు మీడియా వారి సంఖ్యను తక్కువగా పేర్కొంది. రెండు, ఏ రాజకీయ నేతో లేదా ఏ రాజకీయ పార్టీనో సంఘటితపరచడం లేదా నేతృత్వం వహిస్తు న్నట్టు కానరాలేదు. మూడు, అధికారులతో సంఘర్ష ణకు దారి తీసిన ఘటన ఒక్కటీ జరగలేదు. ప్రదర్శకుల మధ్య సైతం అవాంఛనీయమైనది ఏదీ సంభవించ లేదు.
నాయకులంతా అస్పష్టంగానే గోచరమయ్యారు. అంతా రాజకీయాలకు అతీతంగా ఒకే విధమైన ప్రయో జనాలు, ఉద్దేశం ఉన్నవారు. ప్రదర్శనల తేదీలు, వేళలు, స్థలాలు, మార్గాలు, ఏర్పాట్లు, వగైరా అన్నీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే అందరికీ చేరాయి. భాగ స్వాములైన వారిలో ప్రతి ఒక్కరూ మరో 100 మందిని సమీ కరిస్తామని వాగ్దానం చేశారు. వేదికలనుంచి నల్ల దుస్తులు ధరించిన బాలికలు మరాఠాల డిమాండ్ల చదివి వినిపించారంతే. అవన్నీ ప్లకార్డులపై ఉన్నవే.
అధికారులు తమ మధ్య చీలికలను సృష్టించడానికి యత్నిస్తారని నాయకత్వం తెరవెనుకనే ఉండిపోయింద నేది స్పష్టమే. అయితే, రాజకీయవేత్తలు వారిలో తప్పక ఉన్నారు. అవసరమైన డబ్బును, సీసాల్లోని మంచినీటిని వారే సమకూర్చారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు తెరవెనుక ఒకరిని మించి మరొకరు ఈ ప్రదర్శన లకు సహాయం అందించాలని పోటీపడి ఉంటారు, ఎవరికి వారే పైచేయి సాధించాలని యత్నించి ఉంటారు. అందువల్ల లాభపడింది ప్రదర్శకులు మాత్రమే.
కీలక సమస్యలపై రాజకీయాలను దూరంగా ఉంచే ధోరణి ఇంతకు ముందు కూడా మహారాష్ట్రలో ఉంది. దివంగత శరద్ జోషి ఈ విధంగానే అందరినీ షేత్కారీ సంఘటనలోకి సమీకరించి, నేతృత్వం వహిం చారు. ‘‘ఈ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పడు మీరు మీ రాజకీయ పాదరక్షలను బయటే వదలి రండి’’ అంటూ రైతులనుద్దేశించి ప్రకటిస్తూ ఆయన తన సభలను ప్రారంభించేవారు. అయితే ఆయనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, తాను పరిహసించిన పార్టీల మద్దతుతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు.
1980లలో దళితులు కూడా రిపబ్లికన్ పార్టీలోని చీలికలకు అతీతంగా ఏకమై, తమను అవమానాలకు గురిచేస్తున్న మరాఠాలకు వ్యతిరేకంగా సమరశీల పోరా టాన్ని నిర్వహించారు. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా మార్పించారు. దళితులు తమపై అత్యాచారాల చట్టాన్ని ప్రయోగించకుండా చట్టాన్ని మార్చాలని నేడు మరా ఠాల కోరికల జాబితా కోరుతోంది. దీంతో ఒక సంక్ర మణం పూర్తయిందని అనుకోవచ్చు.
రాజకీయ పలుకుబడి కలిగిన మరాఠాలు విద్యా సంస్థలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లును కోరడం అతి విచిత్రం. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారాన్ని శాసించేది వారే. పేరుకు ఒక వీపీ నాయక్ లేదా సుధాకర్ నాయక్ లేదంటే మనోహర్ జోషి లేదా దేవేంద్ర ఫడ్నవీస్ అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కావచ్చు. కాసులు కురిపించే విద్యాసంస్థలకు యజమానులు, నిర్వాహకులుగా ఉన్నవారు కూడా మరాఠాలకు చెందినవారే.
కాలక్రమంలో మరాఠాల అధికారం పదును సరిగ్గా ఎప్పుడు తగ్గిందో చెప్పడం కష్టం. అధికార చట్రానికి, ప్రగతికి తమను దూరంగా ఉంచుతున్నారన్న భావన ఏర్పడింది. తమ కులానికే చెందిన పెద్దలు రాజకీయాలను వ్యాపారంగా నిర్వహిం చినా... మరాఠాల ఆర్థిక ప్రయోజనాల పట్ల వారు శ్రద్ధ వహిస్తున్నంతకాలం దాన్ని పట్టించుకోరు అన్నట్టుంది. విద్యా సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని లేదా ఫీజులలో రాయితీలు ఇవ్వాలని వారు కోరడం లేదు.
అది ఆసక్తికరం అనడం ఈ విషయాన్ని తక్కువ చేసి చెప్పడమే అవుతుంది.
- మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com