సిర్పూర్(టి) : ప్రపంచంలోనే అతి పెద్ద దృఢ, అధృడ రాజ్యాంగం.. భారత రాజ్యాంగం. దీనికి బుధవారంతో 65 ఏళ్లు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌కు అందజేసిన భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రచించిన మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రచించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ దర్శనీయకత నేటికి సజీవంగా ఉంది.
తొలి నాళ్లలో 395 నిబంధనలు 8 షెడ్యుళ్లు ఉన్న రాజ్యాంగం తదనంతర కాలంలో 450 నిబంధనలు 12 షెడ్యుళ్లుగా మారింది. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని నేటి విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో జనవరి 26 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ స్ఫూర్తి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రఇంటలెక్చువల్ ఫోరం, దళిత సాహిత్య అకాడమీ, బిడారు సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఐనాల సైదులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో డాక్టర్ వీఆర్.అంబేద్కర్ - భారత రాజ్యాంగం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ సుదర్శన్, ప్రముఖ ఇంజినీర్ భయ్యాజి రాంటెంకి (చంద్రాపూర్), ఎస్.హరినాథ్ (హైదరాబాద్) తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
నేడు ‘రాజ్యాంగం’పై సెమినార్
Published Wed, Nov 26 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement