నిరంతర స్ఫూర్తి ప్రదాత | babasaheb ambedkar was inspired so many people | Sakshi
Sakshi News home page

నిరంతర స్ఫూర్తి ప్రదాత

Published Thu, Apr 14 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

నిరంతర స్ఫూర్తి ప్రదాత

నిరంతర స్ఫూర్తి ప్రదాత

సందర్భం
నూట ఇరవై అయిదేళ్ల క్రితం భార తీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు- అంబేడ్కర్. 125 ఏళ్ల తరువాత... ఈ 125 కోట్ల మహా భార తానికి బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఈ దేశ గతిరీతులకు విధాత. నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ణేత. కులం పునాదులను పెకలిం చాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకా రులకు మహోపాధ్యాయుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక. ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింప చేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ, ఆర్థిక విధానాలకూ నిత్య నిర్దేశకుడు అంబేడ్కరే. ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.

ఆయన రాసిన ప్రతి అక్షరం, పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం. ఆ నిత్య స్ఫూర్తిమంతుని 125వ జయంతిని జరుపుకోవడం, సేవలను మననం చేసుకోవడం ఒక గొప్ప అనుభవం. చారిత్రక అవసరం.
 అస్పృశ్యతా శాపానికి గురైన మహర్ కుటుంబంలో పుట్టిన అంబేడ్కర్, ఆ వర్గంలో మెట్రిక్యులేషన్ చేసిన మొదటి విద్యార్థి. బరోడా మహారాజు ఆర్థిక సాయంతో ముంబైలో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా) వెళ్లారు. అక్కడ ఉన్నా భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించేవారు. ‘సంఘా నికి సంబంధించినంతవరకు అస్పృశ్యులు వేరు కాదు. వారు భార తీయ సంస్కృతిలో అవిభక్త భాగమే’ అని ‘ఇండియన్ రేస్’ అనే తన వ్యాసంలో స్పష్టం చేశారు. తరువాత ఆయన చేసిన పరిశోధన లకు ఈ సిద్ధాంతమే ఆధారం.

బైండ్ రసెల్ రాసిన ‘రీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ’ మీద అంబేడ్కర్ రాసిన పరిశీలనాత్మక వ్యాసం అమెరికాలో ప్రశంసలు అందుకుంది. అమెరికా విద్య తరువాత 1920లో లండన్ వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ లైబ్రరీని జీవిత సర్వస్వంగా మార్చుకున్నారు. రెండున్నర సంవత్సరాలలో రెండు డిగ్రీలు పూర్తిచేశారు. ‘ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్  ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ అనే అంశం మీద పరిశోధక పత్రం సమర్పించినందుకు 1921లో ఎమ్మెస్ డిగ్రీ, ‘ది ప్రోబ్లెమ్ ఆఫ్ ది రూపీ’ అనే అంశం మీద సమర్పించిన పత్రానికి డాక్టర్ ఆఫ్ సెన్సైస్ (డీయస్సీ) డిగ్రీ (1922) లభించాయి. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త హెరాల్డ్ జె లాస్కీ ప్రశంసలు పొందిన ఏకైక భారతీయుడు డాక్టర్ అంబేడ్కర్. అదే సమయంలో  న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు.

అంబేడ్కర్ స్వదేశానికి వచ్చిన తరువాత 1927లో న్యాయ వాద వృత్తిని చేపట్టారు. అదే సమయంలో బొంబాయి విధాన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆర్థిక అంశాల మీద అపరిమితమైన పరిజ్ఞానం కలిగిన డాక్టర్ అంబేడ్కర్ మండలిలో బడ్జెట్ మీద చేసిన మొదటి ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుకు ప్రభు త్వం ధర్మకర్తగా ఉండాలే తప్ప దుబారా చేస్తే, తన పరిధులు దాటి ప్రవర్తించడమవుతుందని అప్పట్లోనే అంబేడ్కర్ చెప్పారు. అయితే అస్పృశ్యుడయినందున ఆ రోజుల్లో కొన్ని పత్రికలు వ్యతి రేకంగా ఉండేవని ఆయనే చెప్పుకున్నారు. తన మీద వచ్చే విమర్శలకు జవాబు ఇవ్వడానికీ, తన ఉద్యమాన్ని అభిప్రాయా లనూ ప్రచారం చేయడానికీ ‘బహిష్కృత భారతి’ అనే పత్రికను స్థాపించారు.

భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న రౌండ్ టేబుల్ సమావేశాలకు (1930) అంబేడ్కర్ లండన్ వె ళ్లారు. ఆంగ్లేయులు అస్పృశ్యులకు ఎంతటి నమ్మకద్రోహం చేశారో ఘాటుగా విమర్శిం చారాయన. ‘భారతదేశంలో సిక్కులు, ముస్లింలు మినహా మిగిలి నవారంతా హిందువులే. అయినప్పటికీ అటు హిందువులతో గానీ, ఇటు సిక్కులతో గానీ సంబంధ బాంధవ్యాలు లేని ఒక ప్రత్యేక తెగ ఉన్నది. అటు సేవకులుగా కాకుండా, ఇటు బాని సలుగా కాకుండా వారిని ఒక ప్రత్యేక తెగలా చూస్తున్నారు. ప్రపం చంలో ఎక్కడా లేనటువంటి అస్పృశ్యత అనే సాంఘిక దురాచా రంతో అడుగడుగునా అవమానిస్తున్నారు.

వారు చాలా దయనీ యమైన జీవితం గడుపుతున్నారు. అటువంటి ఈ దేశాన్ని సుమారు 150 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ‘మీరు’ (ఆంగ్లే యులు) ఈ అస్పృశ్యతను నివారించేందుకు ప్రయత్నించడం లేదు. సరికదా, దానిపై మీకు కనీస అవగాహన లేకపోవడం దురదృష్టకరం’ అని ఎలుగెత్తి చాటిన ధీశాలి అంబేడ్కర్. ఈ మాటలు బ్రిటిష్ ప్రధానిని ఎంతో ప్రభావితం చేశాయి. తరువాత అంబేడ్కర్ మైనారిటీస్ కమిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ‘కమ్యూనల్ అవార్డ్’ను ప్రకటించింది.

దాని ప్రకారం భారతదేశంలో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం కొన్ని ప్రత్యేక స్థానాలను నిమ్నజాతులకు కేటా యించాలి. అయితే, ఈ ప్రతిపాదనతో హిందూ సమాజం రెండుగా చీలిపోతుందన్న అభిప్రా యంతో ఎరవాడ జైలులో ఉన్న గాంధీజీ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు అంబేడ్కర్‌ను సంప్రదించారు. పూనా ఒడంబడిక జరిగింది. ఆ విధంగా కమ్యూనల్ అవార్డ్ అమలులోకి వచ్చాక రిజ ర్వుడు స్థానాలు ఉనికిలోకి వచ్చాయి. మహా రాష్ట్రలో అంబేడ్కర్ స్థాపించిన ఇండియన్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించి శాసన సభలో అడుగుపెట్టింది.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగ రచన గురించి చర్చ జరిగింది. అరబ్ దేశాలకు రాజ్యాంగం రాసిన సర్ ఐవరీ జెన్నింగ్స్‌తో రాయించాలని కొందరు ప్రతిపాదించారు. కానీ దేశ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉన్న అంబేడ్కర్ ఉండగా, ఒక విదేశీయునితో రాజ్యాంగం రాయించే ప్రతిపాదన సరికాదని గాంధీజీ వాదించారు. వారి మధ్య రాజకీయ వైరుధ్యం ఉన్నప్ప టికీ అంబేడ్కర్ సమర్థత తెలిసిన గాంధీజీ రాజ్యాంగ రచన బాధ్యతను ఆయనకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. జాతి, కుల, మత వివక్ష లేకుండా అందరికీ సమంగా వర్తించే ప్రాథమిక హక్కులను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరి చారు. అణగారిని కులాలకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు.

ఒక వ్యక్తికి ఒకే ఓటు అన్న సూత్రాన్ని రాజ్యాంగంలో పొందు పరిచినందువల్లనే మన ప్రజాస్వామ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పంచాయతీలు మొదలు పార్లమెంట్ వరకు అన్ని వర్గాల వాణి వినపడడానికి కారణం అదే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫెడరల్ స్ఫూర్తితో పని చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన విభజనతో అధికారాలు, బాధ్యతలను అప్పగించారు అంబేడ్కర్. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల మధ్య అధికారాలు, బాధ్యతలను విభజించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ సమన్వయంతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పోగొట్టుకోకుండానే భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా రాజ్యాంగం నిలబెట్టింది. భారత రాజ్యాంగం దృఢమైనది. అదే సమయంలో కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వీలైనది. అందుకే వందకుపైగా సవరణలు జరిగినప్పటికీ ప్రపంచంలోనే పటిష్టమైన రాజ్యాంగంగా నిలవగలిగింది. ఈ ఘనత అంబేడ్కర్‌దే. రిజర్వు బ్యాంక్ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉంది. అందరికీ సమానావకాశాలు అందించే ఆర్థిక ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేయాలన్నదే ఆయన ఆశయం.


 డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
 (వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి

 మొబైల్: 99890 24579)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement