సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీని తెచ్చారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం కరెక్ట్ కాదన్నారు.
కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మెడికల్ కాలేజీలపై చంద్రబాబు, పవన్, లోకేష్ విషం కక్కారు. వైద్య విద్యను అమ్మేశారంటూ ఎల్లో మీడియాలో అడ్డగోలుగా రాతలు రాశారు, మాట్లాడారు. చంద్రబాబు వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా ఉంది. వైద్య విద్యను ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై కేబినెట్‌లో లోకేష్, పవన్ ఎందుకు మాట్లాడలేదు?. చంద్రబాబు ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా?.
ఏపీలో 12 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరో 17 కాలేజీలను తెచ్చారు. పేదల గురించి జగన్ ఆలోచిస్తారు కాబట్టే కొత్తగా మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఏపీలో అదనంగా 750 సీట్లను వైఎస్ జగన్ పెంచగలిగారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి పేదలకు వైద్యాన్ని అందించారు. 17 కాలేజీలను పూర్తి చేసి వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి. ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం కరెక్టు కాదు. వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలి. లేకపోతే వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుంది. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారు. టోల్ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రైవేటీకరణ గురించి ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment