పోలీసులకే రక్షణ లేదు.. ఇంక ప్రజలకా?: మేరుగు నాగార్జున ఫైర్‌ | Merugu Nagarjuna Serious Comments On AP Govt And Chandrababu | Sakshi
Sakshi News home page

పోలీసులకే రక్షణ లేదు.. ఇంక ప్రజలకా?: మేరుగు నాగార్జున ఫైర్‌

Published Wed, Aug 28 2024 12:38 PM | Last Updated on Wed, Aug 28 2024 1:12 PM

Merugu Nagarjuna Serious Comments On AP Govt And Chandrababu

సాక్షి, తాడేపల్లి: ఏపీలో నారా వారి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రంలో రాజకీయ కక్షతో పాలన సాగుతోందన్నారు. అలాగే, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. చంద్రబాబు అసమర్థ పాలనతో పోలీసుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు అని పోలీసులు కేక్ కట్ చేయటం ఏంటి?. అసలు ఆమెకి ఏ హోదా ఉందని పోలీసులు అలా వ్యవహరించారు?. టీడీపీ ఎమ్మెల్యే అస్మిత్‌ రెడ్డి వీడియో కాల్‌లో సీఐతో సారీ చెప్పించుకున్నారు. ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉన్నాయా?. రాజ్యాంగం, చట్టాలు ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తులేదా?. పథకం ప్రకారం వ్యవస్థలన్నింటినీ నీరు గార్చుతున్నారు.

పోలీసుల మీద తప్పుడు కథనాలు రాయించటం, తర్వాత వారిపై వేటు వేయటం అలవాటుగా మారింది. ఐపీఎస్‌లకు విధులు, బాధ్యతలు లేకుండా పక్కన కూర్చోపెట్టారు. నిజాయితీగా పనిచేయడమే వారు చేసిన తప్పా?. సీతారామపురంలో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బరాయుడి హత్య జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. తొందపడి వెళ్తే చంద్రబాబు ఏం‌ అంటారోనని పోలీసులు భయపడి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితులు వలన పోలీసు వ్యవస్థకి కలంకం ఏర్పడుతోంది.

 ప్రజలను రక్షించాల్సిన పోలీసులు తమను తాము రక్షించుకోవాల్సిన దుస్థితిలోకి వెళ్లారు. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తోందా?. నారా వారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా?. ఏపీలో పోలీసులే కాదు ప్రతీ అధికారి భయంతో బతుకుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు. భట్టిప్రోలులో ఒక టీడీపీ కార్యకర్త పోలీసు చొక్కా పట్టుకున్నారు. కడప జిల్లాలో మంత్రి భార్య పోలీసులను బెదిరించారు. లోకేష్ భార్య, కొడుక్కి పోలీసులు గౌరవవందనం చేయటం ఏంటి?. ముంబై వారికి సంబంధించి ఒక కేసు వస్తే పోలీసులు కేసు కట్టారు. దాని గురించి ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీ నేతలపై విష ప్రచారం చేస్తోంది. కేసు, ఎఫ్ఐఆర్ రికార్డులోనే ఉంది. ఇందులో ఇద్దరు అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేశారు. ఈ కేసులో ఇంకా ఏం చేస్తారో చూస్తాం అంటూ కామెంట్స్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement