చర్చకు వచ్చే దమ్ముందా?.. టీడీపీ నేతలకు మంత్రి మేరుగ సవాల్‌ | Minister Merugu Nagarjuna Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చర్చకు వచ్చే దమ్ముందా?.. టీడీపీ నేతలకు మంత్రి మేరుగ సవాల్‌

Published Tue, Oct 17 2023 4:47 PM | Last Updated on Tue, Oct 17 2023 4:54 PM

Minister Merugu Nagarjuna Fires On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని, సీఎం జగన్‌ పాలనలో ఎంతో మేలు జరుగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, పేదవాడు పేదవాడుగానే ఉండాలనేది టీడీపీ విధానం అంటూ దుయ్యబట్టారు.

కాకినాడలో చనిపోయిన దళితుని విషయంలో చట్టం ఏం చెబితే అదే చేస్తాం. కానీ చంద్రబాబు పార్టీ ఆ విషయాన్ని రాజకీయం చేస్తోంది. నాలుగున్నరేళ్లుగా దళితులకు చేసిన న్యాయంపై చర్చకు మేము సిద్దం. చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?’’ అంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

టీడీపీ హయాంలో దళితులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, వెలివేతలు ఎన్నో జరిగాయి. వీటిపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. నిన్న మీటింగ్ పెట్టిన టీడీపి నేతలు నా సవాల్‌ని స్వీకరించగలరా?. పేదలకు ఇళ్లు, స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపిన నీచ చరిత్ర టీడీపీ నేతలది. ఇంగ్లీషు మీడియం చదవాలనుకున్న పిల్లలకు ఆ అవకాశం రాకూడదని కోర్టులకు వెళ్లిన నీచ చరిత్ర వారిది. దళితులకు అసైన్డ్‌ భూములను అప్పగించిన సీఎం జగన్‌ని చూసి మిగతా రాష్ట్రాలు వారి మ్యానిఫెస్టోలో పెట్టుకుంటున్నారు. మా ఆత్మగౌరవమైన అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెడుతున్నాం. 14 ఏళ్లు సీఎంగా ఉండి మా దళితులకు చంద్రబాబు ఏం చేశారు. దీనిపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి మేరుగ నిలదీశారు.

‘‘కుటిల కులతత్వం చంద్రబాబుది. దళితులకు మేలు జరగాలని చూసే వ్యక్తి జగన్‌. ఏపీలో పేదరికం తగ్గింది. జగన్ చేసిన సంక్షేమం వలనే ఇది సాధ్యమయ్యింది.  చంద్రబాబులాగ మేము రాజకీయాలను కలుషితం చేయం. దళిత సంక్షేమాన్ని భుజాన వేసుకొని పనిచేస్తాం. జగన్ విద్యారంగంలో  విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులు ఐక్య రాజ్యసమితిలో మాట్లాడగలిగారు’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘కోర్టు రిమాండ్‌కి పంపితే చంద్రబాబు జైలుకు వెళ్లారు. దీనిపై రాజకీయాలు చేయటం అనవసరం. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఏదేదో మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన కోసం ప్రత్యేకంగా వైద్య బృందాలు ఉన్నాయని మంత్రి మేరుగ అన్నారు.
చదవండి: అన్ని సీట్లలో పోటీ చేయదట.. టీడీపీపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement