బడుగుల అభివృద్ధి కనిపించడంలేదా? | Merugu Nagarjuna fires on eenadu | Sakshi
Sakshi News home page

బడుగుల అభివృద్ధి కనిపించడంలేదా?

Published Sat, Dec 2 2023 5:01 AM | Last Updated on Sat, Dec 2 2023 5:01 AM

Merugu Nagarjuna fires on eenadu  - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలో బడుగువర్గాల అభివృద్ధి ఈనాడు రామోజీరావుకు కనిపించడంలేదా అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న సామాజిక విప్లవం, నెరవేరుతున్న అంబేడ్కర్‌ ఆశయాలు వృద్ధ రామోజీరావు కంటికి కనిపించడం లేదని మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో బడుగులు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పని గట్టుకుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లుతూ రోత రాతలు రాసే రామోజీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారని చెప్పారు. అంబేడ్కర్‌ కోరుకున్న విధంగా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. నాడు – నేడు కార్య­క్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థలకన్నా మిన్నగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్‌ మీడియం బోధన ప్రవేశపెట్టి పేద కుటుంబాల్లోని పిల్లల­కు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నారని తెలి­పారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యా­ర్థులు ఇప్పు­డు ఇంగ్లిష్‌ కూడా అనర్గళంగా మాట్లాడటం రామోజీకి  కనిపించడంలేదన్నారు.

ఇవేవీ రామోజీకి పట్ట­వని.., ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు మాత్రం ఆయనకు చాలా స్వీటుగా కనిపిస్తున్నారని అన్నారు. ఏపీలో దళితులకు అన్యా­యం జరుగుతు­న్నట్లు రామోజీ చూపిస్తున్న కపట ప్రేమ అని, వాస్తవానికి రామోజీ, చంద్రబాబు ఇద్ద­రూ దళిత వ్యతిరేకులేనని స్పష్టంచేశారు. దళితుల భూముల్ని లాక్కుని ఫిల్మ్‌సిటీ నిర్మించుకుని రూ.లక్షల కోట్ల ఆస్తులు పోగేసుకున్నది రామోజీ­రావని అన్నారు. దళితులపై దాడుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిన చరిత్ర చంద్రబాబు­దన్నారు. బాబు చేసిన దళిత ఊచకోతలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కారంచేడు, పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ ఘటనలన్నీ బాబు హ­యాం­లో ఆయన సామాజి­కవర్గం చేసిన దాష్టీకా­లేనన్నారు.

దళితులు బిక్కు­బిక్కు మంటూ బతికా­రని, ఎప్పుడు టీడీపీ ప్రభు­త్వం మారుతుందా అని ఎదురుచూశా­రన్నా­రు. సీఎం జగన్‌ అధికారంలోకొచ్చాక దళిత కుటుంబాల స్థితిగతులు మారా­యని, ధైర్యంగా బతుకుతు­న్నా­రని చెప్పారు. పేద­రికం 12 శాతం నుంచి 6 శాతా­నికి వచ్చిందంటేనే సీఎం జగన్‌ పాలనా సమర్థత అర్ధమవుతుందన్నా­రు. సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. దళిత క్రైస్త­వుల్ని ఎస్సీలు చేసేందుకు తీర్మానం చేసిన చరిత్ర సీఎం జగన్‌దని చెప్పారు.

ప్రపంచం గర్వించేలా అంబేడ్కర్‌ విగ్రహం
చంద్రబాబు సీఎంగా ఉండగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముళ్ల పొదలకే పరిమితం చేయాలని చూశారని.., సీఎంగా జగన్‌ వచ్చాక విజయవాడ నడిబొడ్డున ఆకాశమంత ఎత్తులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు చంద్రబాబు అమ్ముకోవాలని ప్రయత్నించిన అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్రపంచం గర్వించేలా 125 అడుగుల విగ్రహాన్ని రూ.400 కోట్లతో సీఎం జగన్‌  ఏర్పాటు చేస్తున్నారన్నారు.

సీఎం జగన్‌ అందిస్తున్న సుపరిపాలనను ప్రపంచం యావత్తూ కొనియాడుతుంటే రామోజీరావు మా­త్రం ఎందుకు రాయలేకపోతున్నారని ప్రశ్నించారు. బాబును అధికార పీఠంపై కూర్చో­బెట్టా­ల­న్న కుతి­తో రామోజీరావు రోజుకో రీతిగా ప్రభుత్వ పథకాల­పై, లబ్ధి పొందుతున్న వర్గాలపై రామోజీ రో­త రాత­లు రాస్తున్నారన్నారు. ఆయనెంతగా రా­సు­కుని, గు­న­పాలతో పైకి లేపినా బాబుకు అ­ధికారం కల్లేనని, రామోజీ పిచ్చి కలే­నని చెప్పారు. ఇప్పటికైనా నీచ­మైన రాతలు మాను­కో­వాలని హితవు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement