డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి నేడే | BR ambedkar towers inaugaration in hyderabad | Sakshi
Sakshi News home page

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి నేడే

Published Thu, Apr 14 2016 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

BR ambedkar towers inaugaration in hyderabad

సర్వత్రా ఘనంగా ఉత్సవాలు
పలు కార్యక్రమాలు తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించనున్న సీఎం
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన
‘అంబేడ్కర్ టవర్స్’కు శంకుస్థాపన, భూమి పూజ

 
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు గురువారం ఘనంగా జరగనున్నాయి. వీటిలో భాగంగా రాష్ట్రప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 125 అడుగుల ఎత్తయిన అంబే డ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం    మిగతా 6వ పేజీలో ఠ
 
శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఉదయం 10.30కు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ (లిబర్టీ) సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 10.50కి లోయర్ ట్యాంక్‌బండ్‌లో  శిథిలావస్థలో ఉన్న అంబేడ్కర్ భవన్ స్థానంలో ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ టవర్స్’’ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహిస్తారు. తర్వాత 11.15 నిమిషాలకు యూసుఫ్‌గూడలో ‘భాగ్యరెడ్డి వర్మ మెమోరియల్ బిల్డింగ్’ (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం) నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన, భూమిపూజ జరుపుతారు. 11.45 గంటలకు నెక్లెస్ రోడ్డులో ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉన్న పార్టీ జోన్ స్థలంలో 125 అడుగుల ఎత్తై అంబేడ్కర్ కాంస్య విగ్ర హ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన, భూమి పూజ నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 12.15కు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కాంప్లెక్స్ పక్కనున్న డాక్టర్ కార్స్ స్థలంలో బహిరంగసభ ఉంటుంది. దీనికి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, టి.పద్మారావు, పి.మహేందర్‌రెడ్డి,అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement