
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర పీవీ మార్గ్‌లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి విగ్రహా నిర్మాణం పూర్తి కానున్నట్టు తెలిపారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
అనంతరం.. కేటీఆర్ మరోసారి బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఏం తినాలో కూడా బీజేపీనే చెబుతోందని విమర్శించారు. దళితులపై కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దళితబంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించాం. టాలెంట్ ఎవరి అబ్బసొత్తు కాదు. ప్రపంచంలో రెండు కులాలు.. డబ్బు ఉన్నవారు.. డబ్బు లేని వారని ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. దేవుడి అందర్నీ సామానంగానే పుట్టించాడు. కులం, ఉప కులం, మతం అనేవి మనమే సృష్టించుకున్నామని అన్నారు.
Live: Speaking at the 131st Birth Anniversary celebrations of Bharat Ratna Dr. B.R. Ambedkar https://t.co/ZaSQcvNoQy
— KTR (@KTRTRS) April 13, 2022