ప్రభుత్వోద్యోగులకు వరసగా మూడురోజులు సెలవులు రానున్నారుు. ఈ నెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయూలకు సెలవు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వోద్యోగులకు వరసగా మూడురోజులు సెలవులు రానున్నారుు. ఈ నెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయూలకు సెలవు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక సంస్థలకు సైతం ఆరోజు సెలవు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగానే శని, ఆదివారాలు సెలవు. అంబేద్కర్ జయంతి వచ్చే సోమవారం రోజున రావడంతో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారాంతపు సెలవులు వరసగా మూడురోజులు లభించినట్టరుుంది. ఇలావుండగా ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా ఏప్రిల్ 18న కూడా కేంద్రం సెలవు ప్రకటించింది. దీంతో వచ్చేవారంలో కూడా వరసగా మూడురోజులు సెలవులు రానున్నారుు.