పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కేంద్రం సమాయత్త మైతోంది. మార్చి లో జరగ నున్న సమావేశాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు మొదలు పెట్టారు. శాఖల వారీగా కేటాయింపులను నిర్ణయించేందుకు.. ఆయా రంగాల్లో నిపుణలతో భేటీ అవుతున్నారు. అంశాల వారీగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశ మయ్యారు.
కాగా.. ఈ సమావేశంలో యలమంచిలి శివాజీ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో రైతులకు భరోసా ఇచ్చే నేత కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై కేబినెట్ లో చర్చలు జరగటం లేదని అన్నారు. పంటల భీమాను రైతు యూనిట్ గా మార్చాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాట ధర పొందేందుకు బోనస్ ఇవ్వాలని కోరారు.