The budget session
-
గొంతులు కూడా తడపలేరా?
= గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం = నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలన్న విపక్షనేత శెట్టర్ బెంగళూరు: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను మార్చి చివరిలోగా ఏర్పాటు చేస్తామన్న తన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షనేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘గ్రామీణ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు ఏడు వేల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, లేదంటే పదవికి రాజీనామా చేస్తానని గత ఏడాది మీరే చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,500తాగునీటి కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మీకే మాత్రం నైతికత ఉన్నా ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, మీకూ మధ్య అభిప్రాయ బేధాలున్నాయో లేక నిధులు విడుదల కాలేదో! అవేవీ మాకు తెలియదు. మాకు కేవలం ఫలితాలే ముఖ్యం’ అని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల తాగునీటి కేంద్రాల స్థాపనకు టెండర్లను పిలిచామని, అయితే అధికారుల లోపం, కాంట్రాక్టర్ల తప్పుల కారణంగా 4000 కేంద్రాలకు సంబంధించిన టెండర్లను తిరస్కరించామని వివరించారు. ఈ కేంద్రాల స్థాపనకు సంబంధించి మరో సారి టెండర్లను పిలవాల్సి రావడంతో ఈ ప్రక్రియ కాస్తంత ఆలస్యమైందని పేర్కొన్నారు. -
హాయ్‌ల్యాండ్‌లో ఏపీ బడ్జెట్ సమావేశాలు
-
హాయ్‌ల్యాండ్‌లో ఏపీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ : మార్చిలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్ రిసార్టులో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి తుది మ్యాప్‌ను అధికారులు ఖరారు చేశారు. హాయ్‌ల్యాండ్ లోని ఒకే ప్రాంగణంలో ఏపీ శాసన సభ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలకు అనుగుణంగా ప్రాంగణాన్ని రూపొందించేందుకు రూ.12 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని సర్కార్ నిర్ణయించింది. శాసన సభ ఏర్పాట్లను చూసే కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వనున్నారు. సీఆర్డీఏ ద్వారా కాంట్రాక్టుల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన జైట్లీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కేంద్రం సమాయత్త మైతోంది. మార్చి లో జరగ నున్న సమావేశాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు మొదలు పెట్టారు. శాఖల వారీగా కేటాయింపులను నిర్ణయించేందుకు.. ఆయా రంగాల్లో నిపుణలతో భేటీ అవుతున్నారు. అంశాల వారీగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశ మయ్యారు. కాగా.. ఈ సమావేశంలో యలమంచిలి శివాజీ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రి ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో రైతులకు భరోసా ఇచ్చే నేత కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై కేబినెట్ లో చర్చలు జరగటం లేదని అన్నారు. పంటల భీమాను రైతు యూనిట్ గా మార్చాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాట ధర పొందేందుకు బోనస్ ఇవ్వాలని కోరారు. -
రాజ్యసభ ప్రొరోగ్
ఎగువ సభను అర్ధంతరంగా ముగించిన ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీకి మార్గం సుగమం న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌ను.. పునఃజారీ చేయటం కోసం రాజ్యసభ బడ్జెట్ సమావేశాల కాలాన్ని తగ్గించి.. శనివార ం నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేశారు. రాజ్యసభ 234వ సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరవిధికంగా వాయిదా వేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 20వ తేదీ నుంచి సెలవులు ఉండగా.. వచ్చే నెల 20వ తేదీన తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశాలు మే 8వ తేదీ వరకూ కొనసాగాల్సి ఉంది. అయితే.. తాజాగా రాజ్యసభను ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటంతో ఈ సమావేశాలు ముగిసినట్లయింది. భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనుంది. దీనిస్థానంలో చట్టం తెచ్చేందుకు.. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన భూసేకరణ బిల్లును బడ్జెట్ భేటీల ఆరంభంలోనే లోక్‌సభలో ఆమోదించారు. ఆ బిల్లు రాజ్యసభలో ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోయింది. ఎగువసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం దీనికి కారణం. ఆర్డినెన్స్ గడువు ముగిసే లోగా దాని స్థానంలో చట్టం తీసుకురానట్లయితే.. అది చెల్లుబాటు కాదు. గడువు ముగిసే లోగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ జారీ చేయాలంటే.. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభ అయినా నిరవధికంగా వాయిదాపడి ఉండాలి. -
సభా పర్వానికి తెర
సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 7వ తేదీ నుంచి పద్నాలుగు రోజుల పాటు సమావేశాలు సెల్ఫ్‌గోల్‌తో సభ బయటే ఉండిపోయిన టీడీపీ సమన్వయలోపంతో ప్రధాన ప్రతిపక్షం అభాసుపాలు నోరు జారి.. విచారం వెలిబుచ్చిన ఇద్దరు మంత్రులు సాక్షి, హైదరాబాద్: అధికార, విపక్షాల వాడివేడి చర్చలు, వివాదాలు, సస్పెన్షన్లు, క్షమాపణల మధ్య రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ నెల 7వ తేదీ మొదలైన సమావేశాలను.. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపాక నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. ఈ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవడంలో, వివిధ అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఈ సమావేశాల్లో దాదాపుగా అధికార పక్షమే పైచేయి సాధించింది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సభలో సాంకేతికంగా పదిహేను మంది సభ్యులున్నా... చివరకు వారెవరూ లేకుండానే ఈ సెషన్ ముగిసింది. సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో వివాదం, విపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి ఆయన పైకే వెదజల్లడంతో ప్రారంభమైన గందరగోళం... చివరకు జాతీ య గీతాలాపన వరకూ కొనసాగింది. అయితే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే రోజున ఆయా సభ్యులతో క్షమాపణ చెప్పించడంతో... తర్వాత పన్నెండు రోజుల పాటు సమావేశాలు సజావుగా కొనసాగాయి. టీడీపీ సెల్ఫ్‌గోల్ గవర్నర్ ప్రసంగం రోజున నానా హడావుడి చేసిన టీడీపీ... చివరకు అన్ని పక్షాలు కోరినా సభకు క్షమాపణ చెప్పలేదు. పైగా మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు చోటు లేదంటూ తమకు సంబంధం లేని అంశాన్ని నెత్తికెత్తుకుని అభాసుపాలైంది. ఈ సమయంలో పదే పదే పోడియం వద్దకు దూసుకువచ్చి సభలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఆ పార్టీ ఫ్లోర్‌లీడ ర్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు స్పీకర్ మాట్లాడే అవకాశమిచ్చినా.. సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఆగ్రహించిన అధికార పక్షం ఆ సమయంలో సభలో లేని ఆర్.కృష్ణయ్య మినహా మిగతా 11 మంది సభ్యులను బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కనీసం ఒక్క రోజన్నా చర్చలో పాల్గొనే అవకాశం కోసం టీడీపీ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్ష నేతలను, గవర్నర్‌ను, చివరకు రాష్ట్రపతిని కూడా కలిశారు. స్పీకర్ చాంబర్లోనూ ధర్నాకు దిగారు. కానీ టీడీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా... సస్పెన్షన్ ఎత్తివేయలేదు. కాంగ్రెస్‌లో కొరవడిన సమన్వయం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో ఆ పార్టీ నేత జానారెడ్డి, సభ్యుల మధ్య సమన్వయం కొరవడింది. జాతీయ గీతాన్ని అవమానపరిచారన్న కారణంతో ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో క్షమాపణ చెప్పించడానికి సీఎల్పీ నేత జానారెడ్డి కష్టపడాల్సి వచ్చింది. అన్నిపక్షాల నేతలు ఆ ఘటన వీడియోలను చూసి ఎవరెవరు క్షమాపణ చెప్పాలో తేల్చారు. కానీ సంపత్ క్షమాపణకు ససేమిరా అన్న రీతిలో వ్యవహరించడంతో జానారెడ్డి ఇరకాటంలో పడ్డారు. తర్వాత జరిగిన డి.కె.అరుణ వివాదం విషయంలోనూ ఆమె క్షమాపణ చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై చర్చలో సీఎల్పీ నేతగా జానారెడ్డి తమ నిరసన తెలిపాక కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడానికి ప్రయత్నించారు. దీంతో సీఎల్పీ నేత మాటలను సభ్యులు లెక్క చేయడం లేదన్న అభిప్రాయం వచ్చింది. నోరుజారిన మంత్రులు ఇక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులు.. రెండు పర్యాయాలు సభలో క్షమాపణ చెప్పినంత పనిచేశారు. పేరుకు వారు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పినా... అది పాలకపక్షం వెనకడుగనే అభిప్రాయం వ్యక్తమైంది. తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ.కె.అరుణ, మంత్రి కేటీఆర్ మధ్య జరిగింది. ఈ విషయంలో ఇద్దరూ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, విచారం వ్యక్తం చేశారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు చిన్నారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. చివరకు జగదీశ్‌రెడ్డితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి సభలో విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు రెండు సందర్భాల్లో వాకౌట్ చేశాయి. అయితే అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏకాభిప్రాయం తో సభను నడపడంపై ఈసారి పాలకపక్షం బాగానే శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించింది. కమిటీలకు చైర్మన్లు.. ప్రజాపద్దుల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, అంచనాల కమిటీలకు చైర్మన్లు, సభ్యు ల పేర్లను స్పీకర్ మధుసూదనాచారి సమావేశాల చివరిరోజైన గురువారం సభలో ప్రకటించారు. పీఏసీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్‌గా టీఆర్ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్‌గా టీఆర్ఎస్ సభ్యుడు ఎన్.దివాకర్‌రావు పేర్లను ప్రకటించారు. ఒక్కో కమిటీకి అసెంబ్లీ నుంచి 9 మంది సభ్యుల చొప్పున ఎన్నికయ్యారంటూ.. వారి పేర్లను సభలో చదివి వినిపించారు. పట్టువిడుపులు లేకుండా నడిపాం ‘‘బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం భేషజాలకు పోకుండా, ఎలాంటి పట్టువిడుపులు లేకుండా నిర్వహించింది. సమావేశాలను పొడిగించాలని ఒక్క విపక్షం కూడా కోరలేదు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. సభ సజావుగా సాగడానికి విపక్షాలు సహకరించాయి. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు ముందుకు వెళ్లాం. కేరళలో, పొరుగునే ఉన్న ఏపీఅసెంబ్లీలో ఏం జరిగిందో అంతా గమనించారు. అలాంటి పరిస్థితికి భిన్నంగా గొప్పగా మన బడ్జెట్ సమావేశాలను నిర్వహించాం. మహారాష్ట్రలో గవర్నర్‌ను అవమానించినందుకు ఎంఎన్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను రెండేళ్లు సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ మేం టీడీపీ సభ్యులను ఈ సెషన్‌కు మాత్రమే సస్పెండ్ చేశాం. -మంత్రి హరీశ్‌రావు సంతృప్తికరం ‘‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సం తృప్తి కలిగించా యి. అర్థవంతమైన చర్చలతో, ఫలవంతమైన నిర్ణయాలు తీసుకున్నాం. సభలో జరిగిన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగ పడతాయని, వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. సభలో ఎలాంటి ఉద్రిక్తతకు తావులేకుండా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభ జరిగిందన్న సంతృప్తి మిగిలింది.’’ - స్పీకర్ మధుసూదనాచారి సభా సమయం 14 రోజుల్లో 78.54 గంటల పాటు సమావేశాలు జరిగాయి 36.05 గంటల సమయాన్ని వినియోగించుకున్న అధికార టీఆర్ఎస్ 18.34 గంటల సమయం తీసుకున్న విపక్ష కాంగ్రెస్ బీజేపీ 9 గంటలు, ఎంఐఎం 7.17, సీపీఐ 3.27, సీపీఎం 2.53, వైఎస్సార్సీపీ 1.27 గంటల సమయాన్ని వినియోగించుకున్నాయి. ఇక అతి తక్కువగా టీడీపీ 10 నిమిషాలు, నామినేటెడ్ సభ్యుడు 5 నిమిషాలు తీసుకున్నారు. సభానేత అయిన సీఎం 3.50 గంటలు, ప్రధాన ప్రతిపక్ష నేత 3.21 గంటలు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ 5.19, బీజేపీ ఫ్లోర్ లీడర్ 3.59, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ 1.22 గంటల పాటు చర్చల్లో పాల్గొన్నారు. సమయం వృథా మొత్తంగా చూసినప్పుడు కొంత తగ్గింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ 55 నిమిషాలు, టీడీపీ 10 నిమిషాలు, ఎంఐఎం ఒక నిమిషం, బీజేపీ ఏడు నిమిషాల సభా సమయాన్ని వృథా చేశాయి. ఏడు బిల్లులు పాస్.. ఈ సమావే శాల్లో ప్రభుత్వం 99 ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇవ్వగా... మరో 30 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 147 అనుబంధ ప్రశ్నలకు జవాబిచ్చింది. 81 సభ్యుల ప్రసంగాలు, ఇద్దరు మంత్రుల ప్రకటనలు, మూడు తీర్మానాలు (రిజల్యూషన్స్ అడాప్టెడ్) చేశారు. ఏడు బిల్లులకు ఆమోదం లభించింది. -
అసెంబ్లీలో అడుగు పెట్టేదెలా?
సస్పెండైన టీ టీడీపీ ఎమ్మెల్యేల విఫలయత్నాలు రాష్ట్రపతిని కలిసినా లభించని ప్రయోజనం {పజలు మరచిపోతారని ఎమ్మెల్యేల్లో నిర్వేదం హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు శాసనసభ నుంచి సస్పెండైన టీ-టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తమను సభలోకి అనుమతించాలని స్పీకర్ మధుసూదనాచారిని, గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఒక్కసారి కాదు వంద సార్లు క్షమాపణ చెబుతామన్నా స్పీకర్ స్పందించలేదు. దీంతో టీడీపీ నేతలు ఏకంగా రాష్ట్రపతి వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. అసెంబ్లీ గొడవను చెప్పకుండా... పార్టీ ఫిరాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తమ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారని ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ద్వారా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడంతో... ఆ దిశగా వెళ్లాలని టీడీపీ ఎమ్మెల్యేలు గురువార ం నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి తీసుకొని టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత జానారెడ్డితో చర్చించారు. కానీ దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో సొంతంగానే అవిశ్వాసంపై ముందుకెళ్లాలని భావించారు. ‘శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నాం..’ అని మీడియాకు లీకులు ఇచ్చారు. తీరా అసెంబ్లీ నిబంధనలను పరిశీలించిచూడగా.. టీడీపీకి అది సాధ్యం కాదని తేలడంతో తెల్లబోయారు. 50 మంది మద్దతు అవసరం: 10 శాతం సభ్యుల మద్దతు ఉంటే స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని తొలుత టీడీపీ సభ్యులు భావించారు. అయితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకే ఈ 10 శాతం నిబంధన. అదే సభాపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో 50 మంది సభ్యుల సంతకం అవసరం. ప్రత్యేకంగా రాష్ట్రాల గురించి అందులో వివరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది సభ్యులున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ నియమావళిలో పార్లమెంట్ నిబంధననే పొందుపరిచారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైనా.. ప్రత్యేకంగా తెలంగాణ శాసనసభ నియమావళి రూపొందలేదు. దాంతో అదే 50 మంది సభ్యుల నిబంధనే అమలవుతోంది. అయితే టీడీపీకి సాంకేతికంగా ఉన్న సభ్యులు 15 మంది. కానీ అందులో టీఆర్ఎస్లో చేరిన వారిని మినహాయిస్తే మిగిలేది 12 మందే. ఈ సంఖ్యతో స్పీకర్‌పై అవిశ్వాసం సాధ్యం కాదని తేలడంతో.. అవిశ్వాస తీర్మానం ప్రభుత్వంపైనే పెట్టాలని భావిస్తున్నామని, దీనిపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ఎమ్మెల్యేల్లో నిర్వేదం: బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం రాకపోవడం, సభలో టీడీపీ ప్రాతినిథ్యం లేదన్నట్లుగా అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు పార్టీ సభ్యులకు మింగుడు పడడం లేదు. శుక్రవారం ఇతర పార్టీల నేతలు సభలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరినా... స్పీకర్ నుంచి పరిశీలిస్తామనే తప్ప మరెలాంటి హామీ రాలేదు. దీంతో ఈ సమావేశాల వరకు ఇంతేనా.. అసెంబ్లీలో అడుగుపెట్టేదెలా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలో మునిగిపోయారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వారం పాటు సస్పెన్షన్‌లో ఉన్న తాము.. ఈసారి అసలే కనిపించకుండా పోతే ప్రజలు మరచిపోతారేమోనని ఆవేదన చెందుతున్నారు. -
శాఖ మార్పు కోరలేదు...
డి.కె.శివకుమార్ విద్యుత్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యం బెంగళూరు: తన శాఖను మార్చాల్సిం దిగా కోరినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర ఇంధన శాఖ మం త్రి డి.కె.శివకుమార్ వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... శాఖల మార్పు అంశం సీఎం నిర్ణయంపై ఆధార పడి ఉం టుందని అన్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో శాఖలను మార్చాల్సిందిగా కోరుతూ కొంతమంది మంత్రులు కోరారని, అందులో తన పేరు కూడా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సమస్యలను పరిష్కరించడమే ప్రస్తుతం తనముందున్న లక్ష్యమని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చె ప్పారు. ఇక రాష్ట్రంలో అక్రమ వ్యవసాయ మోటర్లను క్రమబద్దీకరించేందుకు గాను త్వరలోనే ‘కరెంటును ఆదా చేయండి-రైతులను కాపాడండి’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు గాను బడ్జెట్ సమావేశాలకంటే ముందుగానే రైతు సంఘాల నాయకులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా గత ఏడాది బడ్జెట్లో రైతుల వ్యవసాయ పంపుసెట్ల కరెంటు బిల్లుల చెల్లింపునకు గాను 6,200 కోట్ల రూపాయలను కేటాయించామని, అయితే వ్యవసాయ పంపుసెట్ల కరెంటు బిల్లులు 7,200కోట్ల రూపాయలను దాటిపోయాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం అందజేస్తున్న విద్యుత్ దుర్వినియోగం అవుతోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. -
ఎన్డీఏకు ‘పెద్ద’ సవాలే
పార్లమెంటు ముందుకు రానున్న 8 ఆర్డినెన్సులు రాజ్యసభలో మెజారిటీ లేని ఎన్డీఏ 16వ లోక్‌సభ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు మోదీ సర్కారుకు సవాలుగా మారాయి. ఎన్డీఏ సర్కారుకు బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే కూడా పది రోజుల వ్యవధిలో ఒకదాని వెంట ఒకటిగా తీసుకువచ్చిన ఎనిమిది కీలకమైన ఆర్డినెన్సులను ఆమోదింప చేసుకోవటం పెద్ద సమస్య. నిబంధనల ప్రకారం పార్లమెంటు సమావేశాలు మొదలైన 42 రోజుల్లోగా ఆర్డినెన్సులు చట్టరూపం దాల్చాలి. లేని పక్షంలో అవి రద్దవుతాయి. రాజ్యసభలో మద్దతు లేకపోవటంతో కీలకమైన భూసేకరణ ఆర్డినెన్సుకు చట్టరూపం తేవటం కోసం ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదింపజేసుకోవటం మినహా ఎన్డీఏ ముందు ప్రత్యామ్నాయం లేదు. మొత్తమ్మీద ఈనెల 23 నుంచి మొదలుకానున్న పార్లమెంట్ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. - నేషనల్ డెస్క్ భూసేకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంపు, బొగ్గు గనులకు ఇ-వేలం, గనులు, ఖనిజాలకు వేలం ద్వారా లెసైన్సులు ఇవ్వటం(ఎంఎండీఆర్), భారతి సంతతి పౌరులు(పీఐఓ), అంతర్జాతీయ భారత పౌరసత్వా(ఓసీఐ)లను విలీనం చేసి పీఐఓలకు జీవిత కాలపు వీసా ఇవ్వటం, ఢిల్లీలో అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ, రాజధానిలో ఈ-రిక్షాలకు అనుమతి వంటి కీలకాంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేయటం వివాదాస్పదమైంది. వీటిలో ఢిల్లీలో అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ, ఈ-రిక్షాల ఆర్డినెన్సులు రాజధాని అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చినవే. ఈ రెండు ఆర్డినెన్సులు బీజేపీకి ఎన్నికల్లో ఎలాంటి లాభాన్ని చేకూర్చలేకపోయాయి. ఎలాగూ రాజకీయ ప్రయోజనాలు నెరవేరలేదు కాబట్టి ఇక ఇప్పుడు ఈ ఆర్డినెన్సులను అత్యవసరంగా చట్టరూపంలోకి తీసుకురావలసిన తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పీఐఓలకు శాశ్వత వీసా అంశంపైనా ప్రతిపక్షాలకు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, ప్రధానమైన నాలుగు ఆర్డినెన్సులకు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకోవటం ప్రధాని మోదీ టీమ్‌కి సమస్యే. భూసేకరణపై రచ్చ రచ్చే.. అన్నింటికంటే ముఖ్యమైంది భూ సేకరణ ఆర్డినెన్సు. ఈ వ్యవహారం ఇప్పటికే ఎన్డీఏ సర్కారును రచ్చకీడ్చింది. వివిధ రంగాల అభివృద్ధికి భూములను సేకరించే సందర్భంలో రైతుల అనుమతి అక్కర్లేదంటూ తెచ్చిన ఆర్డినెన్సు.. రైతు హక్కులను కాలరాసేలా ఉందంటూ విపక్షాలు ఆర్డినెన్సు వచ్చిన రోజు నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ భద్రత, రక్షణ విభాగం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, సామాజిక మౌలిక సదుపాయాల వంటి అయిదు రంగాలలో భూసేకరణ విషయంలో రైతుల అనుమతిని ఈ ఆర్డినెన్సు మినహాయించింది. 2013లో యూపీఏ సర్కారు తెచ్చిన చట్టంలో రైతులకు ఉన్న కనీస రక్షణలనూ ఈ ఆర్డినెన్సు కాలరాసిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. 1894కంటే ఘోరమైన పరిస్థితిని మోదీ సర్కారు రైతులకు కల్పిస్తోందని అన్ని పార్టీలూ ఆరోపిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి నాటి నుంచే దీనిపై దుమారం రేగటం ఖాయం. దాదాపు అన్ని విపక్షాలు ఏకమై గళం విప్పనున్నాయి. తాను తెచ్చిన చట్టానికి ఎన్డీఏ సర్కారు తూట్లు పొడవటంపై కాంగ్రెస్ మండిపడుతోంది. రైతులతో ముడిపడిన అంశం కావటంతో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలకూ ఇదే బ్రహ్మాస్త్రం కానుంది. అంతే కాకుండా సమావేశాలు ప్రారంభమైన మర్నాటి నుంచి అన్నాహజారే సైతం భూసేకరణ చట్ట సవరణపైనే రాజధానిలో దీక్షకు సిద్ధం కావటం మోదీ సర్కారును కచ్చితంగా ఇరుకున పెట్టే అంశమే. అన్నాకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం బహిరంగంగానే మద్దతును ప్రకటించే అవకాశాలుండటంతో ఈ అంశంపైనే బడ్జెట్ సమావేశాలు ఆధారపడి ఉన్నాయి. బొగ్గుకు చిక్కులు బొగ్గు బ్లాకులపై తెచ్చిన ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకురాకుంటే వేలంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై కేంద్ర మంత్రులు ఇప్పటికే చర్చించారు. కోల్‌స్కాంలో 214 లెసైన్సులను సుప్రీం కోర్టు రద్దు చేయటంతో, ఈవేలం ద్వారా కేటాయింపులు చేసే అవకాశం కల్పిస్తూ కేంద్రం ఆర్డినెన్సును తీసుకువచ్చింది. కానీ దీంతో కూడా అక్రమార్కులకే అవకాశం కల్పించినట్లవుతుందని విపక్షాల వాదన. ఈ ఆర్డినెన్స్ మార్చి 20నాటికి ఆమోదం పొందాలి. లేదంటే రద్దయిపోతుంది. బీమా రంగం బీమాపై ధీమా..లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచుతూ ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఆర్డినెన్సుకు కాంగ్రెస్ ఒక విధంగా మద్దతు తెలపవచ్చు. ఎందుకంటే ఈ ప్రతిపాదన గతంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తెచ్చినదే. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో తేలిగ్గా ఆమోదం పొందింది. రాజ్యసభలో మాత్రం విపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. అయితే, ఈ అంశాన్ని వామపక్ష ఫ్రంట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సెలెక్ట్ కమిటీ సిఫారసు వచ్చాక దానిపై రాజ్యసభలో చర్చ జరగాల్సి ఉంది. విపక్షాల డిమాండ్ మేరకే సెలెక్ట్ కమిటీకి వెళ్లింది కాబట్టి, దాని సిఫార్సులకు అంగీకరిస్తే బిల్లు ఆమోదం సమస్య కాకపోవచ్చు. గనులకు ‘ఎర్ర’లైట్ గనులు, ఖనిజాల ఆర్డినెన్స్ పరిస్థితి కూడా విపక్షాల మద్దతుపైనే ఆధారపడి ఉంది. పలు రాష్ట్రాల్లో ఖనిజాలు, గనుల తవ్వకాలకు సంబంధించి ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్న కారణంతోనే ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం పెరిగింది. ఇప్పుడు వేలం ద్వారా లెసైన్సులు జారీ చేయటం అన్నది సంపన్నులకు ఖనిజ సంపద కట్టబెట్టడమేనన్నది విపక్షాల వాదన. వామపక్షాల నుంచి ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘సంయుక్తం’ ఇప్పటికి మూడుసార్లే పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలు పెట్టి బిల్లులకు ఆమోదం పొందిన సందర్భాలు స్వతంత్ర భారత్‌లో మూడే ఉన్నాయి. మొదటిసారి 1961 మే 9న ‘వరకట్న నిరోధక చట్టం’ సంయుక్త సమావేశంలో గట్టెక్కింది. రెండోసారి ‘బ్యాంకింగ్ సర్వీసు కమిషన్ రద్దు బిల్లు’ 1978 మే 16న ఆమోదం పొందింది. చివరిసారిగా వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా... 2002 మార్చి 26న ‘పోటా’ చట్టం ఆమోదముద్ర వేసుకుంది. ఏయే సందర్భాల్లో పిలవొచ్చు ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి 3 సందర్భాల్లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని పిలవొచ్చు. 1.ఏదేని బిల్లును ఒక సభ ఆమోదించి... మరో సభ తిరస్కరించినప్పుడు. 2. ఒక బిల్లుకు చేసిన సవరణలపై ఇరుసభల మధ్య ఏకాభిప్రాయం లేనప్పుడు. 3. ఒక బిల్లు ఏదేని సభకు చేరి ఆరునెలలు దాటినా ఆమోదం పొందనప్పుడు. ఏయే బిల్లులకు...? భూసేకరణ, బొగ్గు గనుల కేటాయింపు బిల్లుల ఆమోదానికి తప్పనిసరిగా ఉభయసభల సమావేశం పెట్టాల్సి రావొచ్చు. ఎందుకంటే భూసేకరణ బిల్లులో తెచ్చిన మార్పులు ప్రజల భూయాజమాన్య హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని విపక్షాలన్నీ ధ్వజమెత్తుతున్నాయి. దీన్ని సమర్థించేటపుడు ఎన్డీఏలోని బీజేపీ మిత్రపక్షాలు కూడా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఉంటుంది. విమర్శలకు ఆస్కారం.. ఏదేని ఒక సభలో అధికారపక్షం సంఖ్యాబలంతో సరైన చర్చ లేకుండా ఏదేని బిల్లును హడావుడిగా ఆమోదింపజేసుకునే అవకాశముంటుందని, అలాకాకుండా చట్టాలపై కూలంకషంగా చర్చ జరగాలనే ఉద్దేశంతోనే మనం ఉభయసభల విధానాన్ని ఎంచుకున్నాం. ఏదేని సభ ఒక బిల్లును అడ్డుకున్నపుడు అఖిలపక్షాన్ని పిలిచి దేశప్రయోజనాలు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆ బిల్లు ఎంత అవసరమో వివరించి... వారిని ఒప్పించాలి. అలాకాకుండా సంయుక్త సమావేశం పెట్టి సంఖ్యాబలం సాధించడమనేది మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలున్నాయి. కలిపి కూర్చోబెట్టినా అంతంతే! సంయుక్త సమావేశం పెట్టినా బిల్లులు గట్టెక్కడం అంత సులభమేమీ కాదు. బొటాబొటి మెజారిటీతో బయటపడతాయి. లోక్‌సభలో 543, రాజ్యసభలో 241 (నాలుగు ఖాళీలున్నాయి) కలిపితే 784 అవుతుంది. ఇందులో మెజారిటీ అంటే 393 ఓట్లు పడాలి. ఎన్డీఏకు ఉభయసభల్లో కలిపి 399 మెజారిటీ ఉంది (ఎన్డీఏకు అన్నా డీఎంకే మద్దతుగా నిలుస్తుందని భావించి లెక్క వేసిన పక్షంలో). అయితే ఇటీవలి కాలంలో బీజేపీతో శివసేన (ఉభయసభల్లో కలిపి 21 మంది సభ్యుల బలముంది) సంబంధాలు అంత సజావుగా లేకపోవడం గమనార్హం. -
13 నుంచి బడ్జెట్ సమావేశాలు
బెంగళూరు : ఈ ఏడాది మార్చి 13 నుంచి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. క్యాంపు కార్యాలయం కృష్ణాలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19 నుంచి బడ్జెట్ సన్నాహాక సమావేశాలు ఉంటాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో క్షుణ్ణంగా చర్చించి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ సారి బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత బడ్జెట్లో సంక్షేమం కోసం రూ.65వేల కోట్లు కేటాయించగా అందులోఇప్పటి వరకూ 60 శాతం ఖర్చు చేశామని మరో రెండు మాసాలు సమయం ఉండటం వల్ల మిగిలిన మొత్తాన్ని కూడా వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ఈ స్థలానికి సంబంధించి కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని వాటిని జేడీఎస్ పార్టీనే పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. -
సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు
సీ కేటగిరీ గనుల వేలంపై స్పందించిన సీఎం తుంగభద్ర పూడికతీత అసాధ్యం ప్రత్యామ్నాయలపై దృష్టి మంత్రి జారకిహోళికి శాఖ మార్పు మార్చిలో బడ్జెట్ సమావేశాలు బళ్లారి : రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరు నుంచి బాగల్‌కోటకు వెళుతూ జిందాల్ విమానాశ్రయంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఆ గనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారని, ఆయనతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ చేస్తున్నామన్నారు. తుంగభద్రలోని పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి సతీష్ జారకిహోళి శాఖ మార్పు, ఆయనకు ఏ శాఖ కేటాయించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం జారకిహోళికి సముచిత శాఖ కల్పిస్తామన్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. వచ్చే వారం బడ్జెట్‌కు సంబంధించి నిపుణులతో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.