
మహాత్మాగాంధీపై ఒవైసీ వ్యాఖ్యలు
జాతిపిత మహాత్మాగాంధీ కన్నా డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
సంభల్: జాతిపిత మహాత్మాగాంధీ కన్నా డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. దళిత దిగ్గజం అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని, దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని కొనియాడారు.
కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఒవైసీ సంభాల్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. 'అంబేద్కర్ మహాత్మాగాంధీ కన్నా పెద్ద నాయకుడు. ఆయన లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకుంటే సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయావి. ఆరెస్సెస్ పరిస్థితులను మరింత దారుణంగా మార్చేది' అని ఒవైసీ అన్నారు.