
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారాయన.
‘‘పేదల కోసం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారు.కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారు’’ అని ఒవైసీ అన్నారు.
మజ్లిస్ పార్టీ అధినేత ఇంతకు ముందు కూడా కేసీఆర్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. వారం కిందట హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. అయితే తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆ సందర్భంలో ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment