
సాక్షి, హైదరాబాద్: కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్ కేంద్ర ప్రభుతాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి చర్చించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు.
అంబేడ్కర్ ఫొటో సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్ ముదిరాజ్ కార్యాలయంలో జరిగింది. అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, బొల్లిస్వామి, జాతీయ అధికార ప్రతినిధి మబ్బు పరశురాం, నాయకులు రవి, జి.కష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment