సాక్షి, తాడేపల్లి: డా.బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ హాజరయ్యారు.
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: ఈ యుగం బాబాసాహెబ్‌దే!
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2 pic.twitter.com/Lt1TQ5711D
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023
Comments
Please login to add a commentAdd a comment