విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని, అలాగే రూల్ 77 కింద తామిచ్చిన నోటిసుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్నారు.
విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని, అలాగే రూల్ 77 కింద తామిచ్చిన నోటిసుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం సచివాలయం వద్ద తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు భారీగా పోలీసులను మోహరించారు.