
అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
రాష్ట్ర విభజన వద్దు.. విభజనను అడ్డుకుంటామనేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ విధానమని.. వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీలో స్పష్టంచేసింది. ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వనందుకు.. సభనుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ వాకౌట్ చేసింది. విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది సభ తేల్చాలని.. ఇందుకు ఓటింగ్ ఉంటుందా లేదా అన్న అంశంపై.. స్పీకర్ స్పష్టత ఇవ్వాలని..వైఎస్ విజయమ్మ కోరారు.
రాష్ట్ర విభజన.. ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి చేస్తున్న కుట్రఅన్న విజయమ్మ.. ఈ కుట్రలో తాము భాగస్వాములం కామన్నారు. 10 కోట్ల తెలుగుజాతికి అన్యాయం చేయొద్దని.. అసలు తెలుగు ప్రజలు ఎందుకు విడిపోవాలని.. వైఎస్ విజయమ్మ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. విభజన బిల్లుపై చర్చించడమంటే ప్రజలను వంచించడమేనంటూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.