అందరికీ అన్ని స్థాయిలో ఆర్థిక సేవలందించటమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అందరికీ అన్ని స్థాయిలో ఆర్థిక సేవలందించటమే ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ సహా సమాజంలో అన్ని వర్గాలకూ రుణ సౌలభ్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పారిశ్రామికీకరణ, పారిశ్రామిక వేత్తలపై బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, భావాలపై మంగళవారం ఇక్కడ దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ నిర్మాతే కాదని, ఆయన ఒక నేర్పుగల ఆర్థిక వేత్తకూడానని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ మన దళిత సోదర, సోదరీమణులకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చుతుందని నాడే అంబేద్కర్ సరిగ్గా చెప్పారని గుర్తుచేశారు.