
జయలలితకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
ఆమె మృతికి సంతాపంగా లోటస్ పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.