లక్నో: నిండైన విగ్రహం, నీలం రంగు కోటు, ఒక చేతిలో భారత రాజ్యాంగం, ముందుకు సాగమం టున్నట్లుండే మరో చేతి చూపుడు వేలు..ఇది అందరికీ పరిచితమైన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రూపం. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన ఆయన విగ్రహాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. అయితే, ఆయన కోటు నీలిరంగులోనే ఎందుకు ఉండాలి? ‘నీలి రంగు అంటే ఆయనకు చాలా ఇష్టం. వ్యక్తిగత జీవితంలోనూ వివిధ సందర్భాల్లో ఆయన అదే రంగును వాడారు..’ అని అంబేడ్కర్ మహాసభకు చెందిన లాల్జీ నిర్మల్ తెలిపారు.
‘1942లో అంబేడ్కర్ స్థాపించిన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ పార్టీ జెండా రంగు నీలం... మధ్యలో అశోకచక్రం ఉండేది. ఈ పార్టీని రద్దు చేసి 1956లో ఆయన నెలకొల్పిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ పార్టీకి కూడా నీలం రంగు జెండానే వాడారు. ఆకాశం రంగూ నీలమే. అంతటి విశాలత ను అంబేడ్కర్ కోరుకున్నారు. అందుకే ఆయనకు నీలి రంగు ఇష్టం’అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రముఖ దళిత కార్యకర్త ఎస్‌ఆర్ దారాపురి తెలిపారు. ఇటీవల యూపీలోని బదౌన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం కోటు కాషా యంలో ఉండటం వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత దానిని బీఎస్పీ నీలం రంగులోకి మార్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment