blue colour
-
కాంతులీనుతున్న సాగరతీరం.. రాత్రి వేళ నీలిరంగులోకి భీమిలి బీచ్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీర అందాలకు స్వర్గధామంగా ఉన్న విశాఖలో ఇప్పుడు మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న భీమిలి బీచ్.. వారం రోజులుగా రాత్రి సమయంలో నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేస్తోంది. బయోలుమినిసెంట్ తరంగాల కారణంగా అలల పొంగులో కాంతి వెదజల్లుతుండటంతో పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల కిందట భీమిలి బీచ్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆహ్లాదకరంగా కనిపించే సాగరతీరం... రాత్రి సమయంలో నీలివర్ణంలో వెలిగిపోతోంది. మొదట్లో ఏమవుతుందో అర్థంకాక పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. కానీ.. నీలి అలలు ఎగసిపడుతుంటే.. క్రమంగా వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడని అద్భుతమైన సహజసిద్ధ సముద్ర అందాలను చూసి పులకించిపోతున్నారు. మరోవైపు సముద్రంలో ఏదో జరిగిందంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. బయోలుమినిసెంట్ కారణంగా... బీచ్‌లో ఈ తరహా మార్పులు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా... ఒకింత ఆందోళన కూడా కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫైటో ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలి కాంతి విడుదలవుతుంది. దీంతో బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయి. అయితే, సముద్రంలోని అతి సూక్ష్మ నీలి, ఆకుపచ్చ శైవలాలే (ఆల్గే) భీమిలి బీచ్ నీలివర్ణంలో మెరిసిపోవడానికి కారణమని నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిరకాల ఆల్గేల వల్ల బీచ్‌లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయని, నీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నంతవరకూ బీచ్ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఉంటే ఆందోళనకరమే... దేశంలో ఈ విధంగా బీచ్‌లు తళుక్కున మెరిసిపోవడం కొత్తేమీ కాదు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్, మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, మాల్దీవుల్లోని వాధూ ద్వీపంతోపాటు చెన్నైలోని మెరీనా బీచ్లోనూ కొన్నిసార్లు ఈ తరహా బయోలుమినిసెన్స్ కనిపించింది. ఈ గ్లో–ఇన్–డార్క్కు కారణమైన ఆల్గేలు భారీగా ఉంటే చాలా ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. దీనివల్ల సముద్రంలో ఆక్సిజన్ కొరత రావొచ్చు. ఎక్కువ పోషకాలు, వ్యర్థాలు ఉన్నచోట ఈ ఆల్గే పోగుపడుతుంది. ఎక్కువ రోజులు ఈ నీలి మెరుపులు ఉంటే ఆ ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి సాగరజలాల్లోని జీవరాశులకు కాస్త ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందనే ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా... భీమిలి బీచ్‌లో ఈ తరహా అద్భుతం మాత్రం ఆహ్వానించదగిన పరిణామం. – సాయి కిరణ్, వాతావరణ నిపుణుడు -
జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్
ఇటీవల కాలంటో స్టంట్ల క్రేజ్ మామాలుగా లేదు. కొంతమంది సోషల్ మీడియా స్టార్డమ్ కోసం ఎలాంటి స్టంట్లు చేస్తున్నామన్నా అవగాహన కూడా లేకుండా చేసేస్తున్నారు. ఆ స్టంట్లు ఒక్కొసారి వారి ప్రాణాలకు లేదా పక్కవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఉంటున్నాయి. ఇక్కడొక జంట అయితే ప్రకృతినే పొల్యూట్ చేసే స్టంట్‌కి ఒడిగట్టారు. దీంతో రంగంలోకి దిగిన పర్యావరణ అధికారులు ఆ జంట ఎవరా? అని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. వివరాల్లోకెళ్తే... బ్రెజిల్‌కి చెందిన ఒక జంట సహజ సిద్ధమైన జలపాతాలను తమ స్టంట్ కోసం కలుషితం చేశారు. ఇంతకీ ఏం చేశారంటే...జలపాతం సహజంగా పాలనురగాలా కనిపిస్తుంది జౌనా!. ఐతే ఈ జంట నీలి రంగులా కనిపించేలా ఇంకో అమ్మాయి నీలి రంగు ఫోమ్‌ని జల్లుతూ ఉంటుంది. ఈ స్టంట్ ఉద్దేశ్యం ఏంటంటే..నీలిరంగులో జలపాతం కనిపిస్తే శిశువు మగబిడ్డను సూచిస్తుందని చెబుతూ ఈ స్టంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో సహజ సిద్ధంగా కనిపించే జలపాతాన్ని కలుషితం చేస్తారా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో బ్రైజిల్ పర్యావరణ అధికారులు ఈ సంఘటనపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంతేగాదు బ్రెజిల్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన గత ఆదివారం సెప్టంబర్ 25న మాటో గ్రాస్ అనే రాష్ట్రంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఆ జంట కలుషితం చేసిన జలపాతం ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన క్యూమా పే నది అని అధికారులు వెల్లడించారు. ఆ నది పశ్చిమ ప్రాంతంలోని తంగారా డా సెర్రా నగరానికి ప్రాథమిక నీటి వనరు అని కూడా స్పష్టం చేశారు. అసలు ఆ గుర్తు తెలియని దంపతులు ఏ ఉత్పత్తులు వినియోగించి జలపాతానికి నీలి రంగు వచ్చేలా చేశారు, పర్యావరణానికి హాని జరిగిందా లేదా అనే దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. É sério que acharam uma boa ideia colocar corante numa cachoeira?! Tantas maneiras de fazer um chá revelação e conseguiram escolher justo uma com impacto ambiental. pic.twitter.com/YePJ0lPhhQ — A Eng. Florestal do YouTube 🌳 (@vanecosta10) September 26, 2022 (చదవండి: ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్) -
Color Mystery: కనిపించేదంతా ‘బ్లూ’ కాదు!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఈ సీతాకోక చిలుక ఏ రంగులో ఉంది. అదేమిటి నీలి రంగులోనే కదా అంటారా? అక్కడే తప్పులో కాలేశారన్న మాట. అది మనకు నీలి రంగులో కనిపించడం అంతా మన దృష్టి భ్రమ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే కాదు జంతుజాలంలో 99 శాతం జీవుల్లో వేటిలోనూ నీలి రంగు అనేదే లేదని అంటున్నారు. మరి మన కళ్లముందు కనిపిస్తున్నా అది నీలి రంగు కాదనడం ఏంటి? అసలు ఏమిటీ రంగు మిస్టరీ అని సందేహాలు వస్తున్నాయా.. ఇదేంటో తెలుసుకుందామా? అప్పుడు కళ్లు లేవు.. కలర్ సమస్య లేదు! భూమ్మీద జీవం ఆవిర్భవించి వందల కోట్ల ఏళ్లు అవుతోంది. సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్న జీవులు వేటికీ కళ్లు లేవు. అప్పుడు జంతుజాలానికి రంగుల సమస్యే లేదు. ఆ తర్వాత జంతుజాలం అభివృద్ధి చెంది కళ్లు ఏర్పడ్డాయి. అందంగా కనబడేందుకు, తోడును ఆకట్టుకునేందుకు, కొన్నిసార్లు శత్రు జీవులను భయపెట్టేందుకు, లేదా వాటికి దొరక్కుండా తప్పించుకునేందుకు.. ఇలా వాటి అవసరానికి తగినట్టుగా రంగులు, డిజైన్లను సంతరించుకోవడం మొదలైంది. జంతుజాలంలో ఒక శాతమే.. సీతాకోక చిలుకలు సహా పలు రకాల జంతువులు మనకు నీలి రంగులో కనిపిస్తుంటాయి. కానీ చాలా వరకు నిజమైన నీలిరంగు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం జంతుజాలంలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే నీలి రంగులో ఉంటాయి. మరి ఎందుకిలా..? ‘నీలి రంగు’ సమస్యేంటి? ప్రతి రంగుకు సంబంధించి కొన్నిరకాల రసాయనాలు ఉంటాయి. వాటినే కలర్ పిగ్మెంట్స్ అంటారు. వీటిపై కాంతి పడినప్పుడు సంబంధింత రంగులను ప్రతిఫలిస్తాయి. దాంతో ఆ రంగు మన కంటికి కనిపిస్తుంది. జంతువుల్లోగానీ, మొక్కల్లోగానీ ఏవైనా భాగాల్లో ఏ రంగు పిగ్మెంట్స్ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుంది. అన్ని జంతువులకు కూడా కలర్ పిగ్మెంట్స్ అవి తినే ఆహారం ద్వారానే అందుతాయి. జంతువులు ఏవైనా ప్రాథమిక ఆహారం మొక్కల నుంచే వస్తుంది. (మాంసాహార జీవులైనా కూడా అవి తినే జంతువుల ఆహారం మొక్కలే). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. మొక్కల్లో నీలి రంగు పిగ్మెంట్స్ అత్యంత అరుదు. దాంతో జంతుజాలానికి ఆహారం నుంచి నీలి రంగు అందే అవకాశాల్లేవు. రంగే లేనప్పుడు.. ఎలా కనిపిస్తుంది? నీలం రంగు పిగ్మెంట్స్ అరుదు కావడంతో జంతుజాలం.. వాటిని సేకరించుకోవడం మానేసి, దృష్టి భ్రమపై ఆధారపడ్డాయి. కొన్ని రంగులు, రంగుల మిశ్రమాలను కొన్ని కోణాల్లో చూసినప్పుడు వేరే రంగులుగా భ్రమ కలుగుతుంది. ఈ తరహాలోనే నీలి రంగు కనిపించేలా కొన్ని జంతువులు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. సీతాకోకచిలుక చేసే ట్రిక్ ఏంటి? నీలి రంగు రెక్కలు, అంచుల్లో నలుపు రంగుతో ‘బ్లూ మార్ఫో’ రకం సీతాకోకచిలుక చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇది నీలి రంగులో ఉండదు. దీని రెక్కల్లో అత్యంత సన్నగా ఎగుడు, దిగుడు నిర్మాణాలు ఉంటాయి. ఈ రెక్కలపై పడిన కాంతి అక్కడికక్కడే ప్రతిఫలించి.. ఒక్క నీలి రంగు కాంతి మాత్రమే బయటికి కనబడేలా ఏర్పాటు ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు ఈ సీతాకోకచిలుక రెక్కలు రంగులు మారుతుంటాయి. మనం బాగా ఇష్టపడే నెమలి ఈకలు కూడా ఇలా మామూలుగా చూస్తే నీలి రంగులో మెరుస్తుంటాయి. కాస్త అటూ ఇటూ తిప్పితే వేర్వేరు రంగులు కనిపించడం మనకు తెలిసిందే. మరి అసలైన నీలి రంగు ఏది? ఏ వైపు నుంచి చూసినా కచ్చితంగా ఒకే స్థాయిలో నీలం రంగు కనిపిస్తే.. అది అసలైన నీలి రంగు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలైన రంగు పిగ్మెంట్స్ ఉన్నప్పుడు.. ఒకేస్థాయిలో రంగు కనిపిస్తుందని.. లేతగా, ముదురుగా మారడం కూడా ఉండదని వివరిస్తున్నారు. ఈ ‘ది ఓబ్రినా ఆలివ్‌వింగ్’ రకం సీతాకోక చిలుకలపై ఉండే నీలి రంగు పక్కా ఒరిజినల్ అని తేల్చారు. చదవండి: Harish Rao Birthday: వినూత్న బహుమతి -
కొత్త 100 రూపాయల నోటు, భలే ఉంది!
న్యూఢిల్లీ : గులాబీ రంగులో 2000 రూపాయల నోటు.. పసుపు రంగులో 200 రూపాయల నోటు.. ఆకుపచ్చ రంగులో 50 రూపాయల నోటు.. చాక్లెట్ రంగులో 10 రూపాయల నోటు.. ఇలా విభిన్న రంగుల్లో కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు తర్వాత నకిలీలకు తావులేకుండా ఈ నోట్లలో సెక్యురిటీని మరింత పెంచుతూ తీసుకొచ్చింది. తాజాగా వంద రూపాయల కొత్త నోటును కూడా ఆర్బీఐ తీసుకొస్తోందట. వచ్చే నెలలో ఈ కొత్త నోటును ప్రవేశపెట్టబోతుందని ‘బిజినెస్ న్యూస్’ రిపోర్టు చేసింది. ఈ నోటు ముదురు నీలం రంగులో ఉంటుందని తెలిపింది. కొత్త వంద రూపాయల నోట్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద రూపాయల నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త రూ.100 నోటుకు ప్రింటింగ్ ప్రెస్ వద్ద తుది ఆమోదం లభించిందని, రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసే దగ్గరే, ఈ కొత్త వంద రూపాయల నోట్లను ప్రింట్ చేస్తున్నట్టు బిజినెస్ న్యూస్ రిపోర్టు చేసింది. విదేశీ ఇంక్‌తో దివాస్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఈ నోట్ల ప్రింటింగ్ కూడా ప్రారంభమైందట. కొత్త నోట్లకు అనుగుణంగా బ్యాంకులు తమ ఏటీఎంలలో మార్పులు కూడా చేపడుతున్నాయని తెలిసింది. కాగా, 2017 ఆగస్టులోనే ఆర్బీఐ కొత్త 200 రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు మార్కెట్లోకి వచ్చింది. దేవనాగరి లిపిలో రూ 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు. -
అంబేడ్కర్‌కు నీలం ఇష్టం
లక్నో: నిండైన విగ్రహం, నీలం రంగు కోటు, ఒక చేతిలో భారత రాజ్యాంగం, ముందుకు సాగమం టున్నట్లుండే మరో చేతి చూపుడు వేలు..ఇది అందరికీ పరిచితమైన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రూపం. దేశ వ్యాప్తంగా నెలకొల్పిన ఆయన విగ్రహాలన్నీ ఇదే విధంగా ఉంటాయి. అయితే, ఆయన కోటు నీలిరంగులోనే ఎందుకు ఉండాలి? ‘నీలి రంగు అంటే ఆయనకు చాలా ఇష్టం. వ్యక్తిగత జీవితంలోనూ వివిధ సందర్భాల్లో ఆయన అదే రంగును వాడారు..’ అని అంబేడ్కర్ మహాసభకు చెందిన లాల్జీ నిర్మల్ తెలిపారు. ‘1942లో అంబేడ్కర్ స్థాపించిన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ పార్టీ జెండా రంగు నీలం... మధ్యలో అశోకచక్రం ఉండేది. ఈ పార్టీని రద్దు చేసి 1956లో ఆయన నెలకొల్పిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ పార్టీకి కూడా నీలం రంగు జెండానే వాడారు. ఆకాశం రంగూ నీలమే. అంతటి విశాలత ను అంబేడ్కర్ కోరుకున్నారు. అందుకే ఆయనకు నీలి రంగు ఇష్టం’అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రముఖ దళిత కార్యకర్త ఎస్ఆర్ దారాపురి తెలిపారు. ఇటీవల యూపీలోని బదౌన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం కోటు కాషా యంలో ఉండటం వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత దానిని బీఎస్పీ నీలం రంగులోకి మార్చిన సంగతి తెలిసిందే. -
కలర్‌ఫుల్ మార్కెట్
‘ఆ రెస్టారెంట్‌కి జస్ట్ ఫైవ్ మినిట్స్ టైంపాస్ చేద్దామని వెళ్లాను. అదేంటో అక్కడికెళ్లాక భలే ఆకలేసేసింది. తినకుండా ఉండలేకపోయా’ అంటూ చెప్పే మాటలు వింటుంటాం. సిటీలో వెళ్తుంటే ఒక షోరూంచూశారు. అప్రయత్నంగానే లోపలకి వెళ్లారు. మీకు తెలుసా? ముందస్తు ఆలోచన లేకుండా మిమ్మల్ని అటువైపు మళ్లేలా చేసింది షోరూమ్ ఎంట్రన్స్‌లో ఉన్న ఎట్రాక్టివ్ కలర్ అని. కన్సూమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మార్కెటింగ్ నిపుణుల ప్రధాన అస్త్రాలవి. మనం వాడే ప్రతి ఉత్పత్తి, పొందుతున్న ప్రతి లగ్జరీ మనల్ని ఆకట్టుకునే రంగుల్ని... కట్టుకునే మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఎస్.సత్యబాబు నవ వసంతాన్ని పక్షం ముందుగానే రంగులతో స్వాగతించే పండుగ హోలీ. మానవ జీవితం రంగులతో పెనవేసుకుపోయింది. మనిషి మాత్రమే రంగులను ఆస్వాదించగలడు. రంగుల మీద ఆ ఇష్టమే మార్కెటింగ్ నిపుణులకు వరంగా మారుతోంది. ఉత్పత్తిదారులు వర్ణాస్త్రాలకు పదును పెట్టేందుకు దోహదం చేస్తోంది. రంగులలో కలదు.. జోయ్ హల్లోక్ కలర్ అసైన్మెంట్స్ స్టడీ ప్రకారం బ్లూ కలర్ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఇష్టపడే రంగుగా వెలుగుతోంది. పురుషులు అత్యధికంగా ఇష్టపడే రంగుల్లో బ్లూ 57 శాతం, గ్రీన్ 14 శాతం, బ్లాక్ 9 శాతంగా ఉంటే, మహిళల్లో బ్లూని 35 శాతం, పర్పుల్ 23 శాతం, గ్రీన్ 14 శాతం ఇష్టపడతారు. ఇక పురుషులు అత్యధికంగా ద్వేషించే రంగుల్లో బ్రౌన్ 27 శాతం, ఆరెంజ్ 22 శాతం, పర్పుల్ 22 శాతంగా ఉన్నాయి. ఇక మహిళలు ఆరెంజ్‌ని 33 శాతం, బ్రౌన్‌ని 20 శాతం, గ్రీన్ 17 శాతం మంది ద్వేషిస్తారు. చాలా వరకూ మార్కెటింగ్ సూత్రాలు ఈ తరహా సర్వేల ఆధారంగానే రూపొందుతున్నాయి. మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునే ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం పింక్ రంగులో ఉంటాయనేది వేరే చెప్పనక్కర్లేదు. దాదాపు 90 శాతం వస్తువుల ఎంపిక కలర్స్‌ని బట్టే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సిగ్నల్స్ టు రెస్టారెంట్స్... ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన దగ్గర్నుంచి మనల్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవి రంగులే. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో వెలిగే రెడ్, గ్రీన్ల గురించి సిటీవాసులకు చెప్పక్కర్లేదు. ఇక మనలో తిండిపై ఇష్టాన్ని ప్రేరేపించే శక్తి ఎల్లోకు ఉందని చెబుతారు. అందుకే చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, ఇంకా పలు రకాల ఆహారోత్పత్తులకు అంత డిమాండ్. దీనిని దృష్టిలో ఉంచుకునే సిటీలోని పలు రెస్టారెంట్స్‌లో ఎల్లోని ఏదో ఒక రూపంలో భాగం చేస్తున్నారు. ఉదాహరణకు మెక్‌డొనాల్డ్ ఆర్చ్‌లు, పిజ్జాహట్ బోర్డ్స్. అంతేకాకుండా ఎల్లో ఆప్టిమిస్టిక్ కలర్. విండో షాపర్స్‌ను అట్రాక్ట్ చేసే విషయంలోనూ దీన్ని బాగా వినియోగిస్తున్నారు. రెడ్‌కలర్ ఎనర్జిటిక్. హార్ట్‌రేట్‌ని పెంచుతుంది. యూత్‌ని లక్ష్యంగా చేసుకున్న పిజ్జా సెంటర్లు, కాఫీడేలు, కెఎఫ్సీ.. వంటివి ఎర్రని రంగులున్న బోర్డ్స్‌తో ఆహ్వానిస్తుంటాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌కు ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్స్ వినియోగిస్తే.. అవి ఆహారప్రియత్వాన్ని మాత్రమే కాకుండా వేగంగా తినే తత్వాన్ని కూడా ప్రేరేపిస్తాయన్న నిపుణుల సలహాలను బ్రాండెడ్ ఔట్లెట్స్ అక్షరాలా పాటిస్తున్నాయి. అదే హైక్లాస్ రెస్టారెంట్స్ విషయానికి వస్తే అటు ఆకలిని, ఇటు రిలాక్సయిన భావనను ఒకేసారి కలిగించాలి కాబట్టి.. పీచ్, యాప్రికాట్, క్రీమ్, ఆరెంజ్‌లో వేరియేషన్స్ లీడ్ చేస్తున్నాయి. డిఫరెంట్ షేడ్స్.. బ్లూ కలర్ విశ్వసనీయతకు గుర్తుగా భావిస్తారు. అందుకే మెజారిటీ సెక్యూరిటీ గార్డ్స్ టీమ్ బ్లూగా కనిపిస్తున్నారు. పర్పుల్ అనేది కామ్‌నెస్, ప్రశాంతత కోరుకునేవారిని ఆకర్షించే రంగు. సిటీలోని బ్యూటీపార్లర్స్, ఏజింగ్ ప్రొడక్ట్స్‌కు ఈ కలర్ వాడడానికి ఇదో కారణం. శక్తివంతమైన ఫీలింగ్‌ని బ్లాక్ అందిస్తుందని, పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలనుకునేవారిని ఎట్రాక్ట్ చేయడం కోసం దీనిని ఎక్కువ వాడతారు. బైక్స్, మద్యం బాటిల్స్ కలర్స్‌ని చూస్తే ఈ కలర్ టెక్నిక్‌ని వాళ్లు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. గ్రీన్ ఫీల్డ్ మార్కెటింగ్ లేదా గ్రీన్ మార్కెటింగ్ ఇప్పుడు సిటీలో లేటెస్ట్ బజ్. కలర్‌తో ‘స్పా’ట్... కలర్ థెరపీకి సిటీ ‘స్పా’లు తెగ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ‘మరీ బ్రైట్‌గా కాకుండా మరీ డార్క్‌గా కాని మధ్యస్థపు కాంతితో కనిపిస్తేనే వినియోగదారులు స్పా ఫీల్‌ను ఎంజాయ్ చేయగలరు. అందుకే ప్రత్యేకమైన లైట్ కలర్స్ వినియోగించాం’ అని జూబ్లీహిల్స్‌లోని స్పా యజమాని చెప్పారు. అలాగే జిమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేసే చోట కామింగ్ కెమికల్స్‌ను ప్రేరేపించేందుకు బ్లూ షేడ్స్ వాడతున్నారు. ‘బ్లూ షేడ్ వల్ల వెయిట్స్‌ని మరికాస్త సులభంగా లిఫ్ట్ చేయవచ్చునని రీసెర్చ్ ఫలితాలు వెల్లడించాయి’ అని సిటీ ట్రైనర్ ఒకరు చెప్పారు. నిద్రమత్తుని నిరోధించే గుణం కూడా బ్లూకి ఉంది. ఫన్ కావాలంటే ఫిట్నెస్ రూమ్‌కి ఆరెంజ్ యాడ్ చేస్తారు. యోగా కేంద్రాల విషయానికి వచ్చేసరికి కామింగ్ కలర్ అవసరం. ఓషన్ బ్లూస్, గ్రాస్ కలర్డ్ గ్రీన్‌ని వినియోగిస్తున్నారు. ఇవి పీస్ఫుల్ ఫీల్‌ని అందిస్తాయని యోగా సెంటర్స్ భావిస్తున్నాయి. కలర్‌ఫుల్ టెక్నిక్.. కలర్‌కి మన మనసుల్ని నియంత్రించే శక్తి ఉందని ప్రూవ్ అయిన సంగతే. మార్కెటింగ్‌లో దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకోవడానికి కారణమిదే. కోలా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ దగ్గర్నుంచి లాటమాటినా లాంటి ఈవెంట్ వరకూ సూపర్‌హిట్ అవడానికి ప్రధాన కారణం కలర్. సిటీలోనే కాదు ఎక్కడైనా కలర్ అనేది మార్కెటింగ్‌కు అత్యంత అవసరమైన అంశం. - అనిల్ రమేష్, మార్కెటింగ్ ప్రొఫెసర్