
Konaseema District.. ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కోనసీమ జిల్లా పేరును బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వం కోరింది. సూచనలు, సలహాలను జిల్లా కలెక్టర్‌కు తెలపాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.