నెహ్రూనగర్(గుంటూరు)/తిరుపతి సిటీ/కర్నూలు(సెంట్రల్)/కంచరపాలెం(విశాఖ ఉత్తర)/కడప కార్పొరేషన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణపైనా ఏడుపేనా... అని ఎల్లో మీడియాపై దళితులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వల్ల మీకొచ్చిన నష్టమేంటి? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేసిన కార్యక్రమంపైనా విషపు రాతలేనా.. అని మండిపడ్డారు.
శనివారం రాష్ట్రంలో పలుచోట్ల దళిత నాయకులు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి తమ నిరసన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డున ఏర్పాటు చేయడం ద్వారా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవం పెంచారని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ అన్నారు.
సీఎం జగన్‌కు వస్తున్న ప్రశంసలను జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో విషపు రాతలు రాయించడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేసి నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఊరు చివరన శంకుస్థాపన చేసి గాలికొదిలేసిశారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ను అంటరాని వ్యక్తిగా చూసింది టీడీపీ ప్రభుత్వం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. విషపు రాతలు రాసినా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
విశాఖపట్నంలోని కంచరపాలెం ధర్మానగర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు క్షీరాభిõÙకం చేసి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితుల పవరేంటో టీడీపీకి చూపిస్తామన్నారు. నిరసనలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, దళిత సంఘాల నాయకులు ఐ.రవికుమార్, సుకుమార్, కోరిబిల్లి విజయ్, కంటిపాము గురువోజీ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈనాడు ప్రతులను దళితులు దహనం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, వైఎస్సార్‌సీపీ దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాట ఓబులేసు మాట్లాడుతూ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడమే తప్పన్నట్లుగా వార్తలు ఎందుకు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ స్ఫూర్తితో సీఎం జగన్ పాలన చేస్తుంటే ఓర్వలేకపోతున్నారా? అని నిలదీశారు. నిరసనలో దళిత, వైఎస్సార్‌సీపీ నాయకులు నవీన్, కేదార్‌నాథ్, డీకే రాజశేఖర్, సూర్యుడు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కోసం ఎల్లో మీడియా పాట్లు
తిరుపతి ఎస్వీయూలో అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్వీయూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షు0డు ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబు, ఎల్లో మీడియా.. అంబేడ్కర్ విగ్రహం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయమంటూ విషం చిమ్మిందని మండిపడ్డారు. దళితులుగా ఎవరైనా పుడుతారా అంటూ గతంలో చంద్రబాబు చేసిన అవహేళనను దళితులు ఇంకా మర్చిపోలేదన్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు దళితులు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
నిరసనలో విద్యార్థి సంఘం నాయకులు యుగంధర్, ముని, నరే‹Ù, మనోజ్, శ్రీను, బోస్, అజిత్, సుకుమార్, ముధుసూదన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని అధికారంలోకి తేవడానికి రామోజీ అనేక పాట్లు పడుతున్నారని వైఎస్సార్ జిల్లాలో దళితులు మండిపడ్డారు. కడప అంబేడ్కర్ కూడలిలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆధ్వర్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేశారు.
అవాస్తవాలు ప్రచురిస్తున్న ఎల్లోమీడియాను, వాటిని ప్రోత్సహిస్తున్న టీడీపీని కాలగర్భంలో కలిపేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, నాయకులు ఎన్.సుబ్బారెడ్డి, వీరారెడ్డి, నాగమల్లారెడ్డి, షఫీవుల్లా, సింధు, గోపాలక్రిష్ణ, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment