సినిమాటోగ్రాఫర్‌ మృతికి మాధవన్‌ సంతాపం | Cinematographer Johny Lal Dies Madhavan Tusshar Kapoor Pay Tributes | Sakshi
Sakshi News home page

సినిమాటోగ్రాఫర్‌ మృతికి మాధవన్‌ సంతాపం

Published Thu, Apr 22 2021 12:48 PM | Last Updated on Thu, Apr 22 2021 3:34 PM

Cinematographer Johny Lal Dies Madhavan Tusshar Kapoor Pay Tributes - Sakshi

బాలీవుడ్‌కు చెందిన సినిమాటోగ్రఫర్‌ జానీ లాల్ మరణించారు. ఆయన ‘రెహ్నా హై తెరే దిల్ మే’, ‘పార్టనర్, ఓం జై జగదీష్’, ‘ముజే కుచ్ కెహ్నా హై’.. వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. గతంలో జానీ లాల్‌తో కలిసి పనిచేసిన కోలీవుడ్ నటుడు మాధవన్, బాలీవుడ్‌ నటుడు తుషార్ కపూర్, సతీష్ కౌశిక్ ఆయన‌ మరణానికి సోషల్ మీడియా ద్వారా  తమ సంతాపాన్ని తెలిపారు.

కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ’ హే తెరా దిల్‌ మే’ లో మాధవన్ నటించారు. ఈ చిత్రానికి జానీ లాల్ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేశాడు. ఆయనతో ఆ సినిమాకు కలిసి చేస్తున్న సమయంలో తన వ్యక్తిత్వం తెలిసింది. ఆయన సౌమ్యత, దయ కలిగిన వ్యక్తి అంటూ వారి మధ్య అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. 2001 లో సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘ముజే కుచ్ కెహ్నా హై’ చిత్రంతో తుషార్‌ కపూర్ నటనా రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి జానీతో తుషార్‌ కపూర్ కు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ..‘ ఆర్‌ఐపీ    జానీ లాల్‌ .. చిత్నం ఈ రోజుకు చూస్తుంటే కొత్త సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతోంది , దీనికి కారణం నీ పనితనమేనంటూ’ ట్వీట్ చేశాడు.

( చదవండి: పట్టాలెక్కని కరణ్‌-జాన్వీ సినిమా.. ఏమైందంటే.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement