ఫరీదుద్దీన్ పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్
జహీరాబాద్ టౌన్/ఝరాసంగం (జహీరాబాద్): అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీదుద్దీన్‌కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన హోతి(బి) శ్మశానవాటిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన ఫరీదుద్దీన్ పార్థివ దేహాన్ని రాత్రి ఆయన స్వగ్రామం హోతి (బి)కి తీసుకొచ్చారు.
గ్రామస్తు ల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంట ల వరకు ఇంటివద్దనే ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియానికి తీసుకువచ్చారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చా రు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థి వ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఈద్గా మైదానం వద్దకు తీసుకెళ్లారు.
పార్థనల తర్వాత హోతి(బి)లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ బీబీపాటిల్ పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు పొల్గొన్నారు.
పార్టీకి తీరని లోటు: మంత్రి కేటీఆర్
మంచి మనిషి ఫరీదుద్దీన్ అకాల మరణం టీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ ఆయన మరణ వార్త వినగానే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం వల్ల జహీరాబాద్‌కు రాలేకపోయారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment